ANR: ఆ సినిమా ఎందుకు చేశారు సర్.! ఓపెన్‌గా అడిగేసిన బిచ్చగాడు.. ఏఎన్నార్ ఏం చెప్పారంటే

ANR: ఆ సినిమా ఎందుకు చేశారు సర్.! ఓపెన్‌గా అడిగేసిన బిచ్చగాడు.. ఏఎన్నార్ ఏం చెప్పారంటే


ANR: ఆ సినిమా ఎందుకు చేశారు సర్.! ఓపెన్‌గా అడిగేసిన బిచ్చగాడు.. ఏఎన్నార్ ఏం చెప్పారంటే

తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న రైలులో ఏఎన్నార్ ఓ బిచ్చగాడిని కలిశారు. మాటల మధ్యలో, ఆ బిచ్చగాడు అక్కినేని చేసిన ఓ సినిమాను విమర్శించాడు. దానికి ఏఎన్నార్, తనకూ ఆ సినిమా నచ్చలేదని, చేయాల్సి వచ్చిందని నిజాయితీగా అంగీకరించారట. అభిమానులకు కూడా నచ్చలేదని ఒప్పుకున్నారు. ఈ అరుదైన సంఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..! ఒకానొక సందర్భంలో, లెజండరీ అక్కినేని నాగేశ్వరరావు తిరుపతిలో ఒక కార్యక్రమానికి హాజరై హైదరాబాద్‌కు రైలులో తిరిగి ప్రయాణమయ్యారు. ఈ ప్రయాణంలో ఆయనకు ఒక బిచ్చగాడు ఎదురయ్యాడు. అక్కినేని దగ్గరకు వచ్చిన బిచ్చగాడు డబ్బులు అడగగా, ఆయన కొంత ధర్మం చేసి, సరదాగా అతనితో ముచ్చటించారట. బిచ్చగాడి జీవనం, ఆదాయం, నివాసం వంటి విషయాలపై ఏఎన్నార్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారట.

ఆ మాటల మధ్యలో బిచ్చగాడు ఏఎన్నార్‌తో ఒక సినిమా గురించి మాట్లాడుతూ, “సార్, నేను అంటున్నానని ఏమనుకోకండి. మీరు అప్పుడు చేసిన ఆ సినిమా అసలు ఎందుకు చేశారు? నేను మీ అభిమానిని, కానీ అక్కినేని ఏంటి ఇలాంటి సినిమా చేయడం ఏంటి అనిపించింది. అసలు ఎందుకు ఇలాంటి సినిమా చేశారు అని అందరికీ అనిపించింది,” అంటూ నిర్మొహమాటంగా విమర్శించాడు. దీనికి ఏఎన్నార్ చాలా బాధ్యతాయుతంగా సమాధానం చెబుతూ, “నీకే కాదు, నాకు కూడా అదే అనిపించింది. నాకు నచ్చి ఆ సినిమా చేయలేదు, అలా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను కూడా ఆ విషయంలో రియలైజ్ అయ్యాను. నా అభిమానులకు కూడా ఆ సినిమా నచ్చలేదని నాకు తెలుసు,” అని అన్నారు. అయితే, ఏఎన్నార్ ఆ సినిమా పేరేంటో వెల్లడించలేదు. అక్కినేని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇది చదవండి: ‘ఫైనల్‌లో టీమిండియాను ఓడించే దమ్మున్నోళ్లం.. వాడికి కన్నీరే మిగులుతుంది..’



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *