Tollywood: ఆ స్టార్ హీరో తండ్రి నాకు దేవుడితో సమానం.. ఆయన వల్లే లేడీ సూపర్‌స్టార్ బిరుదు

Tollywood: ఆ స్టార్ హీరో తండ్రి నాకు దేవుడితో సమానం.. ఆయన వల్లే లేడీ సూపర్‌స్టార్ బిరుదు


Tollywood: ఆ స్టార్ హీరో తండ్రి నాకు దేవుడితో సమానం.. ఆయన వల్లే లేడీ సూపర్‌స్టార్ బిరుదు

టాలీవుడ్ నటి విజయశాంతి తెలుగు సినిమా ప్రపంచంలో రాములమ్మగా సుపరిచితులు. స్టార్ హీరోలతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసిన ఆమె.. సరిలేరు నీకెవ్వరుతో రీఎంట్రీ ఇచ్చారు. తన సినీ కెరీర్‌లో దివంగత దర్శకుడు టి. కృష్ణను దేవుడిగా భావిస్తానని, ఆయన తన కెరీర్‌ను మలుపు తిప్పారని గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయశాంతి వెల్లడించారు. దర్శకుడు టి. కృష్ణ నేటి భారతం వంటి చిత్రాలతో తనలోని నటనా సామర్థ్యాన్ని వెలికి తీశారని విజయశాంతి గుర్తు చేసుకున్నారు.

కేవలం గ్లామర్‌కు మాత్రమే కాకుండా, నటనకు ప్రాధాన్యతనిచ్చే నటిగా పేరు రావడానికి పూర్తి క్రెడిట్ ఆయనకే చెందుతుందని ఆమె స్పష్టం చేశారు. విప్లవాత్మక కథలకు, పాత్రలకు తాను సరిపోతానని, తన హావభావాలు అద్భుతంగా ఉంటాయని నమ్మి, తనను ఆయన అన్ని చిత్రాల్లో నటిగా ఎంచుకునేవారని తెలిపారు. ఆయన తనను శాంతమ్మ అని ఆప్యాయంగా పిలిచేవారని, తన ప్రతి సినిమాకి తానే ఉండాలని కోరుకునేవారని విజయశాంతి వివరించారు. ప్రతిఘటన చిత్రం సమయంలో డేట్లు కుదరకపోయినా, టి. కృష్ణ “నువ్వు చేయకపోతే నేను సినిమా చేయను” అని పట్టుబట్టారు. నిర్మాతలందరినీ ఒప్పించి నెల రోజుల సమయం తనకు కేటాయించారని ఆమె వెల్లడించారు. ఈ చిత్రం తనకు సూపర్‌స్టార్‌ అనే బిరుదును తెచ్చి పెట్టిందని, తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని విజయశాంతి పేర్కొన్నారు. ఇక దర్శకుడు టి. కృష్ణ కొడుకే ప్రస్తుత స్టార్ హీరో గోపీచంద్ అని అందరికీ తెలిసిన విషయమే.

ఇది చదవండి: ‘ఫైనల్‌లో టీమిండియాను ఓడించే దమ్మున్నోళ్లం.. వాడికి కన్నీరే మిగులుతుంది..’



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *