సినీరంగంలో కథానాయికగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. దక్షిణాదిలో ఆమె నటించిన మూడు సినిమాలు ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలతో సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా మారింది.
ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ మీనాక్షి చౌదరి. హర్యానాకు చెందిన ఈ అమ్మడు ఫెమినా మిస్ ఇండియా టైటిల్ హోల్డర్. 29 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీలలో ఒకరు. విజయ్ దళపతి నటించిన ది గోట్ చిత్రంలో నటించింది మీనాక్షి.
వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లు వసూలు చేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన 'లక్కీ భాస్కర్'లో దుల్కర్ సల్మాన్ భార్యగా మీనాక్షి కనిపించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీ రూ.100 కోట్లు వసూలు చేసింది.
వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోనూ నటించింది. ఇందులో ఐశ్వర్య రాజేశ్ సైతం నటించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లు వసూలు చేసింది. అంతేకాదు ఈ సినిమాతో తెలుగులో పాపులర్ అయ్యింది.
విజయ్, దుల్కర్ సల్మాన్, వెంకటేష్ వంటి స్టార్ హీరోలకు జోడిగా నటించిన మీనాక్షి .. దాదాపు 4 నెలల్లో రూ. 800 కోట్లకు పైగా సంపాదించింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3 నుండి రూ.5 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. ఆమె ఆస్తుల మొత్తం విలువ రూ.50 లక్షల నుండి రూ.2 కోట్ల వరకు ఉంటుందని టాక్.




