మగవారిలో ఎంతో మంది అవకాడోను ఎక్కువగా తింటారు. వీటిని తినడం వలన కొందరికి ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చేసిన పరిశోధనల్లో తేలింది. మరి, ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు తినకూడదో ఇక్కడ చూద్దాం..
మలబద్ధకం : జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడేవారు అవకాడోను తినకపోవడమే మంచిది. తింటే కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది.
మైగ్రేన్ తలనొప్పి: మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారు అవకాడోను దూరం పెట్టాలి. ఎందుకంటే వీటిలో ఉండే 'టైరమైన్' తల నొప్పిని పెంచుతుంది.
బరువు పెరగడం : ఈ అవకాడోను తింటే బరువు ఈజీగా పెరుగుతారు. వారు మాత్రం అస్సలు తినొద్దు. సన్నగా ఉండే వాళ్ళు ఉంటే లావు అవుతారని నిపుణులు చెబుతున్నారు.
అలెర్జీలు: అవకాడో తిన్న తర్వాత దురదలు వస్తాయి ఇలాంటి వారు అస్సలు తినకండి. ఇంకా నోటి పుండ్లు కూడా వస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




