Heatwave Alert: మండుతున్న సూర్యుడు.. మరి రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?

Heatwave Alert: మండుతున్న సూర్యుడు.. మరి రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?


Heatwave Alert: మండుతున్న సూర్యుడు.. మరి రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?

ఈ ఏడాది సమ్మర్ సీజన్ కాస్త ఎర్లీగానే వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఫిబ్రవరి చివరి వారంలోనే మాడు పగిలే ఎండలు కనిపించాయి. ఇదిలా ఉండగా తాజాగా భారత వాతావరణశాఖ జారీ చేసిన హెచ్చరికలు జనాలను మరింత భయపెట్టేలా ఉన్నాయి. రాబోయే మూడు రోజుల్లో ఉదయం 9 గంటలకే ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటనున్నట్టు తెలిపింది. ఇప్పటితో పోల్చుకుంటే రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

నేడు, రేపు, ఎల్లుండి వేడిగాలుల పరిస్థితులు, ఆకాశం నుండి నిప్పులు కురుస్తున్నట్లు అనిపిస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక మార్చి రెండో వారం నుంచి ఎండలు మరింత పెరుగుతాయని, పగటి పూట ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతారని ఐఎండీ వెల్లడించింది. కాబట్టి జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

మార్చి చివరి నాటికి దేశంలో 40 డిగ్రీల ఉష్ణిగరతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే 12 రాష్ట్రాలకు హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. వాటిలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *