మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. పావులా వడ్డీకే లక్ష వరకు రుణాలు.. 48 గంటల్లోనే అకౌంట్లో జమ!

మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. పావులా వడ్డీకే లక్ష వరకు రుణాలు.. 48 గంటల్లోనే అకౌంట్లో జమ!


మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. పావులా వడ్డీకే లక్ష వరకు రుణాలు.. 48 గంటల్లోనే అకౌంట్లో జమ!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళాలోకానికి చంద్రబాబు సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ విద్యాలక్ష్మీ, ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి, యానిమేటర్లకు ఉచిత స్మార్ట్‌ఫోన్లు పథకం అనే మూడు సరికొత్త పథకాలను ప్రారంభించారు. ఎన్టీఆర్ కళ్యాలక్ష్మి పేరుతో డ్వాక్రా మహిళల కుటుంబాల్లో వెలుగులు నింపనుంది చంద్రన్న సర్కార్, ఇక ఎన్టీఆర్ విద్యాలక్ష్మి కింద ఆడపిల్లల పెళ్లిలకు, ఉన్నత విద్యా కోసం కేవలం పావలా వడ్డీకే రూ.10 వేల నుండి రూ.లక్ష వరకు రుణ సదుపాయం కల్పించనుంది. ఇక డ్వాక్రా సంఘాల నిర్వహణ, బుక్ కీపింగ్ వంటి వాటిని మరింత సులభం చేసేందుకు రూ.15వేల విలువైన యానిమేటర్లను అందించనుంది.

ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం: రాష్ట్రంలోని ఆడ పిల్లల ఉన్నత విద్యాకోసం ఈ సరికొత్త పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకానికి అర్హత ఉండాలంటే డ్వాక్రా సంఘాల్లో కనీసం ఆరు నెలలు సభ్యులుగా ఉండాలి. ఒక కుటుంబంలో కనీసం ఇద్దరు బాలికల ఉన్నత విద్యా కోసం రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ఈ పథకం కింద ప్రభుత్వం పావలా వడ్డీకే రుణాలను అందించనుంది. ఈ రుణాన్ని 48 వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పించింది.

అప్లై చేసుకునేందుకు కావాల్సిన పత్రాలు

ఆధార్ కార్డు, ఆదాయ సర్టిఫికెట్ లేదా డొమిసైల్ సర్టిఫికెట్, స్కాల్ ఆర్ కాలేజ్ అడ్మిషన్ లెటర్, ఫీజు రిసిప్ట్‌

ఎలా అప్లై చేసుకోవాలి: స్థానిక డ్వాక్రా సంఘం లేదా సెర్ప్ యానిమేటర్ లేదా వెలుగు కార్యాలయం ద్వారా ఈ వడ్డీలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలి మీరు దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో మీ స్త్రీనిధి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి

ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి: ఈ పథకాన్ని ముఖ్యంగా ఆడపిల్లల పెళ్లిల్లకు ఆర్థిక భరోసా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చింది. ఈ పథకం కింద డ్వాక్రా మహిళా సంఘాల్లోని సభ్యుల కుటుంబాల ఆడ పిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం అవసరాన్ని బట్టి రూ.10వేల నుంచి లక్ష వరకు రుణాన్ని అందించనుంది.అది కూడా కేవలం రూ.25 పైసల వడ్డీకే ఈ రుణాలు ప్రభుత్వం అందిస్తుంది.

యానిమేటర్లకు ఉచిత స్మార్ట్‌ఫోన్లు: ఇక డ్వాక్రా మహిళా సంఘాల నిర్వాహణ, రికార్డులు,బుక్ కీపింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం సుమారు 27,500 మహిళా సంఘాల్లోని సభ్యులకు రూ.15వేల విలువైన యానిమేటర్లను 5000 మంది కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు అందించనుంది. అలాగే వీటితో పాటు 600 మంది APMలకు ల్యాప్‌టాప్‌లు కూడా ఇవ్వనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *