కావాల్సిన పదార్ధాలు : అర కిలో టర్కీ కోడి మాంసం, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి, టమాటాలు, మాంసాన్ని ఒక గంట మ్యారినేట్ చేయాలి.
ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి దానిలో బిర్యానీ ఆకులు , నాలుగు లవంగాలు, దాల్చినచెక్క వేసి బాగా వేయించాలి.
ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి దానిలో బిర్యానీ ఆకులు , నాలుగు లవంగాలు, దాల్చినచెక్క వేసి బాగా వేయించాలి.
ఆ తర్వాత దానిలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి , టమోటా ముక్కలు వేసి మగ్గించాలి. మ్యారినేట్ చేసిన టర్కీ మాంసాన్ని దానిలో వేసి, మూత పెట్టి రెండు గ్లాస్ ల నీళ్ళు పోసి మీడియం మంటపై బాగా ఉడికించాలి.
మీకు గ్రేవీ కావాలనుకుంటే అర గ్లాస్ కొబ్బరి పాలు పోసి కూరలో మిక్స్ అయ్యే వరకు స్టవ్ మీదే ఉంచాలి. దించే ముందు అర కట్ట కొత్తిమీర వేసి కిందకు దించేయండి.