UPSC Civils Final Results 2026: యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఫలితాల్లో 2025 తెలుగోళ్ల సత్తా.. ఎంత మంది సెలక్ట్‌ అయ్యారో చూశారా?

UPSC Civils Final Results 2026: యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఫలితాల్లో 2025 తెలుగోళ్ల సత్తా.. ఎంత మంది సెలక్ట్‌ అయ్యారో చూశారా?


UPSC Civils Final Results 2026: యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఫలితాల్లో 2025 తెలుగోళ్ల సత్తా.. ఎంత మంది సెలక్ట్‌ అయ్యారో చూశారా?

హైదరాబాద్‌, మార్చి 6: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ 2025 తుది ఫలితాలు ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో మొత్తం 958 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడించింది. ఇందులో జనరల్‌ కేటగిరీ నుంచి 317 మంది ఉండగా.. ఈడబ్ల్యూఎస్‌ నుంచి 104, ఓబీసీ నుంచి 306, ఎస్సీ కేటగిరీ నుంచి 158, ఎస్టీ కేటగిరీ నుంచి 73 మంది చొప్పున ఉన్నట్లు కమిషన్‌ పేర్కొంది. అయితే తాజా ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు అభ్యర్ధులు సత్తా చాటారు. ముఖ్యంగా సివిల్స్​ సాధించే లక్ష్యంతో ప్రిపేరయ్యే పేద కుటుంబీకులకు అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభ‌య హ‌స్తం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే.

సింగరేణి సంస్థ అధ్వర్యంలో సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన 202 మంది అభ్యర్థులకు రూ. ల‌క్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది. రాజీవ్ సివిల్స్ అభయ హస్తం సాయం అందుకున్న అభ్యర్థుల్లో 51 మంది ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయ్యారు. వీరిలో ఏకంగా 20 మంది సివిల్స్ తుది ఫలితాల్లో మంచి ర్యాంకులతో విజేతలుగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మెయిన్స్ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులందరికీ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులను 15 రోజుల్లోగా యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని కమిషన్‌ పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల్లో యూపీఎస్సీ సివిల్స్‌ 2025లో మెరిసిన ఆణిముత్యాలు వీరే..

  • జశ్వంత్‌ చంద్ర 23వ ర్యాంకు
  • సృజన 55వ ర్యాంకు
  • భానోత్‌ లక్ష్మీ రచన 178వ ర్యాంకు
  • డీఎస్‌కే ప్రచేత్‌ 193వ ర్యాంకు
  • ఎస్‌ వర్షిత్‌ రెడ్డి 259వ ర్యాంకు
  • ఎం.పవన్‌కుమార్ రెడ్డి 297వ ర్యాంకు
  • వెలిమినేటి విక్రమసింహారెడ్డి 541వ ర్యాంకు
  • గుమ్మల శ్వేత 573వ ర్యాంకు
  • పల్లి ప్రమోద్‌ విష్ణు 640వ ర్యాంకు
  • గుమ్మల విజయసింహారెడ్డి 682వ ర్యాంకు
  • పోతుపురెడ్డి భార్గవ్‌ 738వ ర్యాంకు
  • పుడారి రాహుల్‌ 748వ ర్యాంకు
  • కుమ్మరి శ్రవణ్‌కుమార్‌ 768వ ర్యాంకు
  • అనిరుధ్‌ కత్తిమాని 786వ ర్యాంకు
  • కోరపోతుల శ్రీకర్‌రాజు 806వ ర్యాంకు
  • ఇస్లావత్‌ శ్రీరామ్‌ హర్ష 823వ ర్యాంకు
  • కట్టా ప్రత్యూష 908వ ర్యాంకు
  • గోగుల రాజశేఖర్‌ 920వ ర్యాంకు
  • గుగులోతు జితేందర్‌ నాయక్‌ 939వ ర్యాంకు

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *