Cinema: థియేటర్లలో బ్లాక్ బస్టర్.. ఓటీటీలో 100 మిలియన్ వ్యూస్.. ఇప్పుడు టీవీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్

Cinema: థియేటర్లలో బ్లాక్ బస్టర్.. ఓటీటీలో 100 మిలియన్ వ్యూస్.. ఇప్పుడు టీవీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్


Cinema: థియేటర్లలో బ్లాక్ బస్టర్.. ఓటీటీలో 100 మిలియన్ వ్యూస్.. ఇప్పుడు టీవీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్

థియేటర్లలో ఆడిన సినిమాలు మొదట ఓటీటీ బాట పడుతుంటాయి.ఆ తర్వాత బుల్లితెరపై కూడా సందడి చేస్తుంటాయి. అలా థియేటర్లు, ఓటీటీలో అదరగొట్టిన ఒక తెలుగు సినిమా ఇప్పుడు టీవీల్లోకి రానుంది. గతేడాది చివరిలో ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అంచనాలకు మించి కలెక్షన్లు రాబట్టింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ నిర్మాతకలు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇక కొన్ని రోజుల క్రితమే ఈ సూపర్ హిట్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. స్ట్రీమింగ్ కు వచ్చిన 5 రోజుల్లోనే 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డును నమోదు చేసిన ఈ మూవీ 11 రోజుల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటేసింది. ఓవరాల్ గా అటు థియేటర్లు, ఇటు ఓటీటీల్లో రికార్డులు తిరగరాసేసిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు టీవీ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. ఇంతకీ ఈ సినిమా ఏదనుకుంటున్నారా?

వారం వారం సూపర్​ హిట్​ సినిమాలను అందిస్తున్న జీ తెలుగు ఈ ఆదివారం (మార్చి 08) మరో బ్లాక్‌ బస్టర్​ హిట్​ సినిమాతో వచ్చేస్తోంది. అదే ఆది సాయి కుమార్​ హీరోగా నటించిన శంభాల. హారర్ ఫాంటసీ మిస్టికల్​ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆది సాయికుమార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా శంభాల నిలిచింది. యుగంధర్​ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అర్చనా అయ్యర్ ​హీరోయిన్ గా నటించింది. అలాగే స్వసిక, మధునందన్, రవి వర్మ, రామరాజు, హర్ష వర్దన్, అన్నపూర్ణ, లక్ష్మణ్ మీసాల, ఇంద్రనీల్ వర్మ, ప్రవీణ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

జీ తెలుగులో శంభాల..

శంభాల సినిమా ఆదివారం ( మార్చి 8) సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానెల్‌లో టీవీ ప్రీమియర్ కానుంది. ఈ మేరకు తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *