
T20I World Cup: టీ20 వరల్డ్ కప్ 2026 ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్ జట్టుతో తలపడేందుకు సిద్ధమైంది. ఈ భారీ పోరు మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ (Narendra Modi Stadium) స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో కేవలం ట్రోఫీ మాత్రమే కాదు, కోట్ల రూపాయల ప్రైజ్ మనీ కూడా ఆసక్తి రేపుతోంది.
ఫైనల్‌కు చేరిన రెండు జట్లపైనా కాసలు వర్షమే..
టీ20 వరల్డ్ కప్ 2026 ప్రైజ్ మనీని ఐసీసీ (International Cricket Council) ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే గత టోర్నమెంట్‌ను పరిశీలిస్తే ఫైనల్‌కు చేరిన రెండు జట్లకు భారీ నగదు బహుమతి లభించడం ఖాయం.
2024 టీ20 వరల్డ్ కప్‌లో మొత్తం ప్రైజ్ పూల్..
11.25 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 103 కోట్లు)
అందులో ఛాంపియన్ జట్టుకు – 2.45 మిలియన్ డాలర్లు
రన్నరప్ జట్టుకు – 1.28 మిలియన్ డాలర్లు
ఫైనల్ ఓడినా కోట్ల బహుమతి..
ఈ లెక్కల ప్రకారం ఫైనల్ ఫలితం ఎలా ఉన్నా కూడా భారత్‌కు భారీ బహుమతి లభిస్తుంది.
ఫైనల్లో ఓడినా కూడా టీమ్ ఇండియాకు సుమారు 1.28 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 12 కోట్లు) ప్రైజ్ మనీగా లభించే అవకాశం ఉంది.
బీసీసీఐ నుంచి కూడా భారీ బోనస్?
2024లో భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బీసీసీఐ (Board of Control for Cricket in India) ప్రత్యేకంగా రూ. 125 కోట్ల బహుమతి ప్రకటించింది.
అదే విధంగా 2026లో కూడా భారత్ టైటిల్ గెలిస్తే బీసీసీఐ నుంచి మరో భారీ రివార్డ్ వచ్చే అవకాశముంది.
చరిత్ర సృష్టించే అవకాశం..
ఈ ఫైనల్లో భారత్ పలు చారిత్రాత్మక ఘనతలు సాధించే అవకాశం ఉంది.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌ను నాలుగోసారి ఆడే తొలి జట్టుగా నిలవొచ్చు.
వరుసగా రెండోసారి టైటిల్ గెలిచే తొలి జట్టు కావచ్చు.
అలాగే స్వదేశంలో టీ20 వరల్డ్ కప్ గెలిచే మొదటి జట్టుగా కూడా చరిత్ర సృష్టించవచ్చు.
అందుకే ఈ ఫైనల్ మ్యాచ్‌పై ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టి నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..