పసిడి ధరలు భారీగా తగ్గుతున్నాయి. గత ఐదు రోజులుగా ధరలు పతనమవుతూనే ఉన్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం, పశ్చిమాసియాపై ప్రభావం వల్ల స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. దీని వల్ల గోల్డ్, సిల్వర్ వైపు పెట్టుబడిదారులు ఆకర్షితులు అవ్వడం వల్ల ధరలు పెరుగుతాయని అందరూ ఊహించారు. కానీ అందుకు భిన్నంగా ధరలు పడిపోతున్నాయి.
ఈ తగ్గింపు తర్వాత హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,62,110 వద్ద కొనసాగుతోండగా.. నిన్న రూ.1,62,880 వద్ద స్ధిరపడ్డాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ రూ.770 కుప్పకూలాయి. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,48,600 వద్ద ఉండగా.. గురువారం రూ.1,49,300 వద్ద స్ధిరపడ్డాయి.
అటు విజయవాడ, విశాఖపట్నంలో కూడా పై ధరలు కొనసాగుతున్నాయి. ఇక బెంగళూరులో కూడా 24 క్యారెట్ల ధర రూ.1,62,110 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,48,600 వద్ద ట్రేడవుతున్నాయి. అటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా ధరలు పడిపోయాయి.
ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,62,260 వద్ద కొనసాగుతుండగా.. నిన్న రూ.1,63,030 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,750 వద్ద ఉండగా.. గురువారం రూ.1,49,450గా ఉంది. అటు బంగారంతో పాటు వెండి ధరలు కూడా కుప్పకూలాయి.
హైదరాబాద్లో కేజీ సిల్వర్ ధర ప్రస్తుతం రూ.2,94,900 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.2,95,000గా స్థిరపడింది. ఇక ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.85 లక్షల వద్ద కొనసాగుతోండగా.. బెంగళూరులో కూడా ఇవే ధరలు ప్రస్తుతం ఉన్నాయి.




