CM Revanth Reddy : విజయ్, రష్మిక ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి.. కొత్త జంటకు స్పెషల్ విషెస్.. ఫోటోస్ వైరల్..

CM Revanth Reddy : విజయ్, రష్మిక ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి.. కొత్త జంటకు స్పెషల్ విషెస్.. ఫోటోస్ వైరల్..


టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమోంటో హోటల్లో వీరిద్దరి పెళ్లి వేడుక జరిగింది. ఇటీవలే మార్చి 4న హైదరాబాద్ తాజ్ హోటల్లో వీరిద్దరి వివాహ రిసెప్షన్ వేడుక జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్వయంగా విజయ్ ఇంటికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ విషయాన్ని విజయ్ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలాగే ముఖ్యమంత్రితో దిగిన ఫోటోలను పంచుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : అమీర్ పేట్ మెట్రో పక్కన ఉన్న సారథి స్టూడియో మాదే.. కానీ.. టాలీవుడ్ నటుడు..

“గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు సాయంత్రం మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం మా హృదయాన్ని కదిలించింది. ఆయన ఎల్లప్పుడూ పంచే ప్రేమ, ఆప్యాయతకు కృతజ్ఞతలు” అంటూ రాసుకొచ్చారు. అలాగే సీఎం తమ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోస్ పంచుకున్నారు. ఆ ఫోటోలలో రేవంత్, రోహిన్ రెడ్డితోపాటు పలువురు నేతలు కనిపిస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రామ్ చరణ్‏ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని.. అప్పుడే ప్రభాస్‏కు చెప్పా.. టాలీవుడ్ నటుడు..

మార్చి 4న విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉండడంతో ఆ వేడుకకు హాజరకాలేకపోయారు. ఆయన సతీమణి గీతారెడ్డి ఈ వేడకకు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విజయ్ దేవరకొండ నివాసానికి వెళ్లి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. “ఇటీవల వివాహబంధంతో ఒక్కటైన సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులను ఈ రోజు వారి నివాసంలో కలిసి, శుభాకాంక్షలు తెలిపాను. ” అని ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా బాబూ.. నరాలు తెగిపోయే సస్పెన్స్, ట్విస్టులు. ఓటీటీలో దుమ్మురేపుతుంది..

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్‏గా నటించింది ఆ స్టార్ హీరోనా.. ? అస్సలు ఊహించలేదుగా.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *