Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త.. మూడ్రోజుల్లో అకౌంట్లోకి డబ్బులు.. చెక్ చేస్కోండి..

Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త.. మూడ్రోజుల్లో అకౌంట్లోకి డబ్బులు.. చెక్ చేస్కోండి..


మొక్కజొన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో రైతుల అకౌంట్లో నగదు జమ కానున్నాయి. మొక్కజొన్న రైతులకు చెల్లించేందుకు మార్క్‌ఫెడ్‌కు రూ.171 కోట్లు తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. అవి మార్క్‌ఫెడ్ నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో వేయనున్నారు. వానాకాలం పంట సీజన్‌కు సంబంధించి మార్క్‌ఫెడ్ 3.77 లక్షల టన్నుల మొక్కజొన్న రైతుల నుంచి సేకరించింది. దాదాపు 78,500 మంది రైతులు వీటిని విక్రయించారు. అయితే రైతులకు చెల్లించాల్సిన సొమ్ము ఇప్పటివరకు పెండింగ్‌లో ఉండగా.. విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మూడు రోజుల్లో అకౌంట్లోకి..

తొలి దశలో మొక్కజొన్న రైతులకు చెల్లించేందుకు ప్రభుత్వం రూ.735.39 కోట్లు విడుదల చేసింది. అనంతరం ఇప్పుడు రూ.171 కోట్లు రిలీజ్ చేసింది. రైతులు సొమ్ము కోసం ఎప్పటినుంచో ఎదురుచూన్నారు. ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అని చూస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో జమ కానుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్నలు విక్రయించి నాలుగు నెలలు అయినా డబ్బులు రాకపోవడంతో రైతులు నిరాశ చెందారు. యాసంగి సీజన్‌కు పెట్టుబడి పెట్టుకోవడానికి నిధుల్లేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొంతమంది రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చుకుంటున్నారు. ఇక ఈ విద్యా సంవత్సరం చివరి దశకు చేరుకోవడంతో పిల్లల ఫీజులు చెల్లించేందుకు నగదు లేక అవస్థలు పడుతున్నారు. నెలలైనా డబ్బులు అందకపోవడంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు, ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేస్తున్నారు.

జనవరి 17 నుంచి పెండింగ్..

గతంలో పంట విక్రయించిన తర్వాత వారానికి ఒకసారి రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అయ్యేవి. కానీ జనవరి 17 నుంచి నిధులు జమ కావడం లేదు. దీంతో సొమ్ము రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఎక్కువ ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా.. విక్రయించాక రూ.లక్షల్లో సొమ్ము రావాల్సి ఉంది. దీంతో ఖర్చుల కోసం డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే రెండు, మూడు రోజుల్లో డబ్బులు పడే అవకశం ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులు జమ చేస్తామని సీఎం రేవంత్ గతంలో ప్రకటించారు. కానీ మున్సిపల్ ఎన్నికలు ముగిసి చాలా రోజులైన ఇంకా ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు జమ చేస్తారనే దానిపై ప్రభుత్వం నుంచి ఎలంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *