Headlines

Viral News: ఇంటి కోసం పునాది తవ్వుతుండగా.. మెరుస్తూ కనిపించడంతో.. ఏంటని చూడగా

Viral News: ఇంటి కోసం పునాది తవ్వుతుండగా.. మెరుస్తూ కనిపించడంతో..  ఏంటని చూడగా


పురాతన కాలంలో మన పూర్వికులు దొంగలకు భయపడి బంగారం, నగలు, డబ్బును భూమిలో పాతిపెట్టేవారు. అవి అలానే ఏళ్ల కాలం పాటు భూమిలో మగ్గిపోయేవి. అయితే ఈ మధ్య కాలంలో నిర్మాణాల కోసం తవ్వకాలు జరిపిన సందర్భాల్లో ఇలా దాచి పెట్టిన నిధులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో వెలుగు చూసింది. ఓ కుటుంబం తమ ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా ఓ నిధి బయటపడింది. దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో పురాతన కాలానికి చెందిన సుమారు 250కిపైగా వెండి నాణేలు కనిపించాయి. ఈ విషయం ఆనోట, ఈనోట పడి చివరకు రెవెన్యూ శాఖ అధికారుల వరకు వెళ్లడంతో వాటిన స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

వివరాల్లోకి వెళ్తే.. బీడ్‌ జిల్లా అష్టి తాలూకాలోని సంగ్వి పటాన్‌లో ఓ కుటుంబం ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరుగుతుంది. ఈ క్రమంలో వారి గడ్డపారకు ఒక్కసారిగా ఏదో తగినట్టు అనిపించింది. ఏంటా అని కాస్త తవ్వి చూగడా అక్కడ ఒక చెంబు కనిపింది. దాన్ని బయటకు తీసి అందులో ఏముందని చూస్తే.. అందులో సుమారు పురాతన కాలానికి చెందిన 250 వెండి నాణేలు బయటపడ్డాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాటిని స్వాధీనం చేసుకన్నారు అధికారులు. అయితే అధికారుల నుంచి కూడా ఈ నాణేలు మిస్ అయినట్టు తెలుస్తోంది. వాటని వెతికే పనిలో పడ్డారు అధికారులు.

Beed Treasure Find (1)

Beed Treasure Find

నాణేలపై “వన్ రూపీ ఇండియా 1941” అని రాసి ఉంది.

అయితే అక్కడ దొరికిన ఈ నాణేలపై “వన్ రూపీ ఇండియా 1941” రాసి ఉందని వీటిని స్వచ్ఛమైన వెండితో తయారు చేసినట్లు పురావస్తు శాఖ అధికారులు చెబుతారు. అయితే ఈ ప్రాంతంలో మరిన్ని నిధులు ఉండే అవకాశం ఉందని అక్కడ మళ్లీ తవ్వకాలు జరిపించినట్టు తెలుస్తోంది.ఈ తవ్వకాల్లో మళ్లీ సుమారు 5 కేజీల వరకు వెండి నాణేలు బయపడినట్టు సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *