Nani: ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నన్ను కట్టిపడేసింది.. యంగ్ హీరో మూవీపై నాని ప్రశంసల వర్షం

Nani: ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నన్ను కట్టిపడేసింది.. యంగ్ హీరో మూవీపై నాని ప్రశంసల వర్షం


న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఓ వైపు హీరోగానూ మరోవైపు నిర్మాతగానూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్అందుకుంటున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న నాని హిట్ : ది థర్డ్ కేస్ తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. హిట్ ఫ్రాంఛైజీలో వచ్చిన ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక కోర్టు సినిమాతో నిర్మాతగానూ సాలిడ్ హిట్ అందుకున్నాడు నాని. ఇప్పుడీ విజయ పరంపరను కొనసాగించేందుకు ది ప్యారడైజ్ అనే మరో సినిమాతో మన ముందుకు రానున్నాడు న్యాచురల్ స్టార్. గతంలో నానితో దసరా లాంటి ఊరమాస్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ ఆడియెన్స్ ను కట్టి పడేశాయి. ఇప్పటకే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ మార్చిలోనే విడుదల కావాల్సింది. అయితే అనూహ్యంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉంటున్న నాని మరో సినిమాపై ప్రశంసలు కురిపించాడు.

గత వారం విష్ణు విన్యాసం సినిమాతో మన ముందుకు వచ్చాడు హీరో శ్రీ విష్ణు. ఇక లేటెస్ట్ గా మృత్యుంజయ్ అనే మరో మూవీతో ఆడియెన్స్ ను పలకరించాడీ ఎంటర్ టైన్మెంట్ కింగ్. ఇవాళే (మార్చి 6) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. అయితే రిలీజ్ కు ముందే ఈ సినిమాను చూసేశాడు నాని. అనంతరం సోషల్ మీడియా వేదికగా మృత్యుంజయ్ సినిమా పై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ‘శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’  సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నన్ను కట్టిపడేసింది. శ్రీ విష్ణు తన కామిక్ టైమింగ్, సరదా పాత్రలతో ఎంతగా నవ్విస్తుంటాడో మనందరికీ తెలుసు. కానీ ఈ సినిమాలో శ్రీ విష్ణు నటన నన్ను ఆశ్చర్యపరిచింది. సందీప్ గుణ్ణం తొలి ప్రాజెక్ట్‌తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారు.. ఆయనకు ముందుగానే అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కొత్త కంటెంట్, కొత్త దారిలో సినిమాను నిర్మించినందుకు హ్యాపీగా ఉంది. టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్’’ అని పేర్కొన్నాడు నాని.

ఇవి కూడా చదవండి

నాని ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *