Headlines

Vijay-Rashmika: విజయ్, రష్మికల పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా? వామ్మో అన్ని కోట్లు దాటేసిందా?

Vijay-Rashmika: విజయ్, రష్మికల పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా? వామ్మో అన్ని కోట్లు దాటేసిందా?


గత వారం రోజులుగా ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నాల పెళ్లి వార్తలే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ విరోష్ వెడ్డింగ్ పేరు తెగ మార్మోగిపోతోంది. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న విజయ్- రష్మిక ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సొంతూరులో నూతన గృహ ప్రవేశం, సత్య నారాయణ వ్రతం, ఊరందరికి విందు భోజనాలు, హైదరాబాద్ లో అభిమానులకు బంతి భోజనాలు.. ఇక చివరగా సినీ, రాజకీయ ప్రముఖులకు వెడ్డింగ్ రిసెప్షన్.. ఇలా సుమారు వారం రోజుల పాటు విరోష్ ఆఫ్ వెడ్డింగ్  నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగింది. ఈ క్రమంలో విజ‌య్ దేవ‌ర‌కొండ-ర‌ష్మికల పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారనేది సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఈ క్రమంలో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ కే ఎక్కువ ఖర్చు అయినట్లు తెలుస్తోంది. అతికొద్దిమంది సమక్షంలో పెళ్లి జరిగినప్పటికీ భారీగానే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.. ఆ తర్వాత విజయ్‌ సొంతూరులో సత్యనారాయణ వ్రతంతో పాటు గ్రామస్తులకు గ్రాండ్‌గా విందు ఏర్పాట్లు.. సంగీత్‌ కార్యక్రమం, అభిమానులకు విందు, దేశవ్యాప్తంగా స్వీట్స్‌ పంపిణీ, పలు దేవాలయాల్లో అన్నదానం, చివరిగా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ వంటి కార్యక్రమాలకు కూడా భారీగానే ఖర్చు అయినట్లు తెలుస్తోంది.

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నాల పెళ్లి కోసం సుమారు రూ. 15 కోట్ల మేరకు ఖర్చు చేసినట్లు సమాచారం. దేశంలోనే ప్రముఖ ఈవెంట్ మేనేజ్‌మెంట్ వారికి ఈ పెళ్లి వేడుకల బాధ్యతను అప్పజెప్పారని తెలుస్తోంది. ఇందుకోసం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా భారీగానే చెల్లించారట.
ఇక తమ పెళ్లి ఖర్చును కూడా విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ కలిసి భరించారని తెలుస్తోంది. పెళ్లి కోసం సుమారు 3కేజీల బంగారంతో పాటు ఖరీదైన దుస్తులు వారు కొనుగోలు చేశారట.

ఖర్చు కంటే రాబడే ఎక్కువ..

విజయ్, రష్మికల పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ప్రసారం చేయనుంది. ఇందుకోసం వీరిద్దరికి ఆ ఓటీటీ సంస్థ సుమారు రూ. 60కోట్లు విజయ్ -రష్మికలకు చెల్లించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ రకంగా వారికి రూ. 45కోట్ల వరకు లాభం వచ్చినట్లు అవుతుంది. సాధారణంగా పెళ్లితో ఎవరికైనా ఖర్చు అవుతుంది. కానీ ఈ విరోష్ జోడీకి మాత్రం రివర్స్ లో డబ్బులు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *