Headlines

Pot Water in Summer: వేసవిలో మట్టికుండ నీళ్లు తాగితే పుట్టెడు లాభాలు.. వడదెబ్బకు నో ఛాన్స్!

Pot Water in Summer: వేసవిలో మట్టికుండ నీళ్లు తాగితే పుట్టెడు లాభాలు.. వడదెబ్బకు నో ఛాన్స్!


Pot Water in Summer: వేసవిలో మట్టికుండ నీళ్లు తాగితే పుట్టెడు లాభాలు.. వడదెబ్బకు నో ఛాన్స్!

ఇప్పుడంటే ప్రతి ఇంట్లోకి ఫ్రిజ్‌లు వచ్చాయిగానీ గతంలో మన పూర్వికులు మట్టి కుండలలో నీటిని నిల్వ చేసుకుని తాగేవారు. వేసవిలో కూడా వేడి తాపం నుంచి బయటపడటానికి వారు ఈ కుండల్లో నీటినే తాగేవారు. ఇప్పుడు అందరూ ఫ్రిజ్ నీళ్లు తాగుతుండటంతో మట్టికుండలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. కానీ ఫ్రిజ్ నీళ్లు శరీరానికి అంత మంచిది కాదు. కాబట్టి ఈ వేసవిలో శరీరాన్ని చల్లబరచడానికి మట్టి కుండ నీటిని తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ మట్టి కుండలు నీటిని చల్లబరచడమే కాకుండా నీటిని సహజంగా శుద్ధి చేయడంలో కూడా సహాయపడతాయి. ఇలాంటి నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. కాబట్టి వేసవిలో ఫ్రిజ్ చల్లటి నీటికి బదులుగా మట్టి కుండ నీటిని తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

మట్టి కుండలో నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

కడుపు సమస్యలను తగ్గిస్తుంది

మనం తినే ఆహారంలో ఎక్కువ భాగం శరీరంలో ఆమ్లంగా మారి, తరువాత విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. బంకమట్టి స్వభావరీత్యా క్షారంగా ఉంటుంది. ఈ మట్టి కుండలోని నీటి pH స్థాయి స్థిరంగా ఉంటుంది. ఇది ఆమ్ల ఆహార పదార్థాలతో చర్య జరిపి pH సమతుల్యతను సృష్టిస్తుంది. అందువల్ల మట్టి కుండలోని నీరు తాగడం వల్ల ఆమ్లత్వం, మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలు దూరంగా ఉంటాయి.

శరీర నిర్విషీకరణ

మట్టి పాత్రలలో నిల్వ చేసిన నీళ్లు తాగటం వల్ల శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పరిశోధన ప్రకారం మట్టి పాత్రలలో నిల్వ చేసిన నీరు శరీరం నుంచి మలినాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.

జీవక్రియను పెంచుతుంది

మట్టి కుండలో నిల్వ చేసిన నీటిలో ఎటువంటి రసాయనాలు ఉండవు. అందువల్ల ప్రతిరోజూ మట్టి కుండ లేదా కుండ నీరు తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. అలాగే ఈ నీటిలో ఉండే ఖనిజాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

వడదెబ్బ నుంచి రక్షణ

వేసవిలో తీవ్రమైన వేడి కారణంగా వడదెబ్బ తగులుతుంది. దీని నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మట్టి కుండల్లోని నీటిని తాగడం మంచిది. ఈ మట్టి పాత్రల్లోని నీటిలో ఖనిజాలు, పోషకాలు ఉంటాయి. ఇవి త్వరగా శరీర హైడ్రేషన్‌కు సహాయపడతాయి.

సహజ శుద్ధి

మట్టి కుండలు ఆహ్లాదకరమైన మట్టి వాసన కలిగి ఉంటుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మట్టి కుండలోని నీరు గొంతు, ప్రేగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా కుండ మట్టితో తయారు చేస్తారు. కాబట్టి ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. మట్టి కుండలోని నీళ్లు మలినాలను తొలగిస్తుంది. ఈ నీరు శరీరంలోని విష పదార్థాలను శుభ్రపరుస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అదే రిఫ్రిజిరేటర్ నీళ్లు గొంతు నొప్పితో సహా ఇతర సమస్యలను కలిగిస్తుంది. కానీ మట్టి కుండలోని నీళ్లు తాగడం వల్ల ఈ సమస్యలు ఏవీ రావు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *