గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానం రద్దు

గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానం రద్దు


గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం రద్దయింది. విమాన ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని పైలట్లు గుర్తించడంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు తక్షణమే విమానాన్ని రద్దు చేశారు. ఈ ఘటన గన్నవరం నుండి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో చోటుచేసుకుంది. సుమారు 70 మంది ప్రయాణీకులు ఈ విమానంలో ప్రయాణించాల్సి ఉండగా, వారిలో మంత్రి గొట్టిపాటి రవి, మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. చివరి నిమిషంలో సాంకేతిక లోపం వెల్లడి కావడంతో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. విమానం రద్దు కావడంతో సాధారణ ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోగా, కొందరు ప్రముఖులు రోడ్డు మార్గాన పయనం అయ్యారు. విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ వసతులు చూసుకోవాలని సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లంచం అడిగిన తహశీల్దార్.. కోపం తో తిరగబడ్డ రైతులు

Telangana: తెలంగాణ టీచర్ల జీతాల కోతపై ప్రభుత్వ స్పష్టత..

US-Israel-Iran War: ఇరాన్ ఆయుధ సామగ్రిని ధ్వంసం చేస్తోన్న అమెరికా

SonuSood: మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్

CM Chandrababu: ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే రూ.25 వేలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *