హైదరాబాద్, మార్చి 5: రైల్వే శాఖలో టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలు రేపట్నుంచి ప్రారంభం కానున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న పలు పరీక్ష కేంద్రాల్లో మార్చి 6, 9, 10, 13 తేదీల్లో ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే అడ్మిట్ కార్డులు కూడా విడుదలయ్యాయి. అభ్యర్థుల అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇటీవలే పరీక్షల రివైజ్డ్ ఎగ్జామ్స్ తేదీలను ఆర్ఆర్బీ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద రైల్వేలోని వివిధ విభాగాల్లో మొత్తం 6,238 టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్లైన్ రాతపరీక్షలు, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఉద్యోగాల తుది ఎంపిక ఉంటుంది.
ఆర్ఆర్బీ రైల్వే టెక్నీషియన్ రాత పరీక్షల అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆర్ఆర్బీ జేఈ సీబీటీ 1 ప్రాథమిక కీ విడుదల.. మార్చి 11 వరకు అభ్యంతరాలకు ఛాన్స్!
రైల్వే శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్వైజర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఆన్లైన్ సీబీటీ 1 రాత పరీక్షలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 19, 20, 25 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. తాజాగా ఈ పరీక్ష ప్రాథమిక ఆన్సర్ కీని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) విడుదల చేసింది. ఆన్సర్ కీతో పాటు, ప్రశ్నపత్రం, రెస్పాన్స్షీట్లను అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. ప్రాథమిక కీపై అభ్యర్థులు రూ.50 చెల్లించి కీ అభ్యంతరాలను లేవనెత్తవచ్చని ఆర్ఆర్బీ వెల్లడించింది. మార్చి 16వ తేదీ వరకు ఇందుకు అవకాశం ఇచ్చినట్లు వెల్లడించింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఆన్సర్ కీ రూపొందించి ఫలితాలు వెల్లడిస్తారు.
ఇవి కూడా చదవండి
ఆర్ఆర్బీ జేఈ సీబీటీ 1 ప్రాథమిక ఆన్సర్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.