Watch Video: అక్కినేని యంగ్ హీరో నాగ చైత‌న్యకు తృటిలో త‌ప్పిన ప్రమాదం.. అసలేం జరిందంటే?

Watch Video: అక్కినేని యంగ్ హీరో నాగ చైత‌న్యకు తృటిలో త‌ప్పిన ప్రమాదం.. అసలేం జరిందంటే?


టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగ చైతన్యకు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌లో ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో జరిగిన ‘వృషకర్మ’ మువీ గ్లింప్స్ విడుదల కార్యక్రమంలో నాగ చైతన్య స్టేజ్‌పై నుంచి పడిపోయాడు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న అభిమానులు, మువీ టీం తీవ్ర ఆందోళన చెందింది. అసలేం జరిగిందంటే..

అక్కినేని హీరో నాగ చైతన్య కొత్త మువీ ‘వృషకర్మ’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ గ్లింప్స్‌ రిలీజ్‌ ఈవెంట్‌ను చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మ‌ల్టీప్లెక్స్‌లో గురువారం నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా స్టేజ్‌పై ఉన్నవారి ప్రసంగించారు. అనంతరం మీడియాతో ముచ్చటించేందుకు అందరూ కుర్చీల్లో కూర్చున్నారు. అయితే ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో స్టేజ్‌పై కూర్చున్న హీరో నాగచైతన్య కూర్చున్న కుర్చీ ఒక్కసారిగా వెనక్కి ప‌డిపోయింది. దీంతో నాగచైతన్య వెనక్కి పడిపోయాడు. ఇంతలో పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై మెరుపువేగంతో ఆయన్ని పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.

ఈ ఊహించని సంఘ‌ట‌న‌తో అక్కడ ఉన్న అభిమానులు, మువీ బృందం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నాగ చైతన్యకు దెబ్బలు తగిలాయేమోనని అభిమానులు, మువీ టీం కంగారు పడ్డారు. కానీ నాగ చైతన్య మాత్రం అప్పటికే తేరుకుని తనకేం కాలేదని చిరునవ్వుతో తన గురించి కంగారుపడుతున్న అభిమానులకు సైగ చేస్తూ వారిని శాంతింపజేశారు. ఆ వెంటనే పక్కనే ఉన్న దర్శకుడు కార్తీక్ దండు సహాయంతో లేచి మరో కుర్చీలో కూర్చుని తన ప్రసంగాన్ని కొనసాగించి అందరినీ అశ్చర్యపరిచాడు. వృషకర్మ చిత్రం గురించి మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.



మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *