హిందూ పంచాగం ప్రకారం చైత్ర మాసం తెలుగు సంవత్సరానికి తొలి మాసమే గాక, ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. మార్చి 4న చైత్ర మాసం ప్రారంభమైంది. ఇది ఏప్రిల్ 2, 2026న ముగుస్తుంది. వసంత రుతువులో తొలి మాసం చైత్ర మాసం. చైత్రమాసం అనగానే.. మనకు ఉగాది, శ్రీరామనవమి పండగలే గుర్తుకొస్తాయి. వేద క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలోని కృష్ణ పక్ష ప్రతిపద తిథి మార్చి 3న సాయంత్రం 5:07 గంటలకు ప్రారంభమై, మార్చి 4న సాయంత్రం 4:48 గంటలకు ముగిసింది. అందువల్ల ఉదయ తిథి ప్రకారం చైత్ర మాసం మార్చి 4 నుంచి ప్రారంభమైంది.
చైత్ర మాసం హిందూ సంప్రదాయంలో ఎంతో ముఖ్యమైనది. ఈ నెలతోనే హిందూ నూతన సంవత్సరం ఉగాది ప్రారంభమవుతుంది. అలాగే చైత్ర, వసంత నవరాత్రులు, రామ నవమి, హనుమాన్ జయంతి వంటి అనేక పవిత్ర పండుగలు ఈ నెలలోనే వస్తాయి. అందుకే చైత్ర మాసం భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగి ఉంటుంది.
చైత్ర మాసంలో వచ్చే ముఖ్యమైన ఉపవాసాలు, పండుగలు
- మార్చి 4, 2026 – హోలీ
- మార్చి 5, 2026 – హోలీ భాయ్ దూజ్
- మార్చి 6, 2026 – భాలచంద్ర సంకష్టహర చతుర్థి
- మార్చి 8, 2026 – రంగ పంచమి
- మార్చి 10, 2026 – శీతల సప్తమి
- మార్చి 11, 2026 – శీతల అష్టమి, బాసోద, కాలాష్టమి, నెలవారీ కృష్ణ జన్మాష్టమి
- మార్చి 15, 2026 – పాపమోచని ఏకాదశి, కృష్ణ నరసింహ ద్వాదశి, మీన సంక్రాంతి
- మార్చి 16, 2026 – ప్రదోష వ్రతం
- మార్చి 17, 2026 – నెలవారీ శివరాత్రి
- మార్చి 18, 2026 – దర్శ అమావాస్య
- మార్చి 19, 2026 – ఉగాది, గుడి పడ్వా, చైత్ర నవరాత్రులు ప్రారంభం
- మార్చి 20, 2026 – ఝూలేలాల్ జయంతి, చంద్ర దర్శన్
- మార్చి 21, 2026 – మత్స్య జయంతి, గౌరీ పూజ, గంగౌర్
- మార్చి 22, 2026 – వాసుదేవ చతుర్థి
- మార్చి 23, 2026 – లక్ష్మీ పంచమి
- మార్చి 24, 2026 – స్కంద షష్ఠి, రోహిణి వ్రతం, యమునా ఛత్
- మార్చి 26, 2026 – రామ నవమి, మహాతార జయంతి, అశోక అష్టమి ఉపవాసం, నెలవారీ దుర్గాష్టమి
- మార్చి 27, 2026 – రామ నవమి (ఇస్కాన్), స్వామినారాయణ జయంతి
- మార్చి 29, 2026 – కామద ఏకాదశి, వామన ద్వాదశి
- మార్చి 30, 2026 – శుక్ల ప్రదోష వ్రతం
- మార్చి 31, 2026 – మహావీర్ జయంతి
- ఏప్రిల్ 2, 2026 – హనుమాన్ జయంతి, చైత్ర పూర్ణిమ ఉపవాసం
ఈ విధంగా చైత్ర మాసం భక్తులకు పూజలు, ఉపవాసాలు, పండుగలతో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని కలిగించే పవిత్రమైన నెలగా భావించబడుతుంది.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని సంస్థ ధృవీకరించదు.)