IND vs ENG, T20 WC Final Live Score: వరుసగా మూడోసారి సెమీస్‌లో ఢీ.. టాస్‌తో విజేత ఫిక్స్..?

IND vs ENG, T20 WC Final Live Score: వరుసగా మూడోసారి సెమీస్‌లో ఢీ.. టాస్‌తో విజేత ఫిక్స్..?


IND vs ENG, T20 WC Final Live Score: టీ20 ప్రపంచ కప్‌లో ఈరోజు భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండవ సెమీఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ సాయంత్రం 6:30 గంటలకు జరుగుతుంది.

సెమీఫైనల్లో ఈ రెండు జట్లు వరుసగా మూడోసారి తలపడనున్నాయి. గతంలో ఇరుజట్లు 2022, 2024లో తలపడ్డాయి. రెండు జట్లు 1-1 తేడాతో గెలిచాయి. సెమీఫైనల్స్ గెలిచిన తర్వాత, రెండు జట్లు ఫైనల్‌ను కూడా గెలుచుకోవడం గమనార్హం.

ఆరోసారి సెమీఫైనల్స్ ఆడనున్న ఇరుజట్లు..

టీ20 ప్రపంచ కప్‌లో భారత్ ఆరోసారి సెమీఫైనల్‌కు చేరుకుంది. గతంలో 2007, 2014, 2016, 2022, 2024లో భారత జట్టు టాప్ నాలుగు స్థానాల్లో నిలిచింది. ఐదు సెమీఫైనల్స్‌లో మూడింటిని గెలుచుకుంది.

ఇంగ్లాండ్ కూడా ఆరోసారి సెమీఫైనల్స్‌లో ఆడుతోంది. గతంలో ఇంగ్లాండ్ జట్టు 2010, 2016, 2021, 2022, 2024లో ఈ దశకు చేరుకుంది. మూడు సెమీఫైనల్స్‌లో విజయం సాధించడం ద్వారా ఫైనల్‌లో తమ స్థానాన్ని భద్రపరచుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *