Tollywood: నా భార్య వదిలేసింది.. రెండో పెళ్లి చేసుకుంటే.. ఆమె కూడా.. తెలుగు నటుడి ఆవేదన

Tollywood: నా భార్య వదిలేసింది.. రెండో పెళ్లి చేసుకుంటే.. ఆమె కూడా.. తెలుగు నటుడి ఆవేదన


నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ తన వ్యక్తిగత జీవితం, వైవాహిక సంబంధాలు, ప్రస్తుత జీవన విధానం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను ప్రస్తుతం శంషాబాద్ సమీపంలో, ఒక రకంగా ‘అడ్రస్ లేని’ ఇంట్లో నివసిస్తున్నానని పేర్కొన్నారు. నగరాల రద్దీ వాతావరణం నచ్చక, ఏకాంతంగా జీవించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఒక వయసు వచ్చిన తర్వాత, తమ మనసుకి నచ్చినట్లు జీవించే స్వేచ్ఛ చాలామందికి ఉండదని, కానీ తనకు ఆ స్వేచ్ఛ లభించిందని అన్నారు. సమాజం నిర్దేశించిన సాధారణ జీవిత పద్ధతి – చదువుకోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలను కనడం – తాను కూడా అనుసరించాలని ప్రయత్నించినా, తన జీవితం ఆ మార్గంలో సాగలేదని శ్రీకాంత్ అయ్యంగార్ వివరించారు. తన నిర్ణయాలు, తాను ఎంచుకున్న దారులు తనకు అనుకూలించలేదని చెప్పారు. 50 ఏళ్లు దాటిన తర్వాత, తాను ఎవరికీ హాని చేయని, చట్టవిరుద్ధం కాని పనులు చేస్తుంటే సమాజం ఏమనుకుంటుందో తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. తనకు ఏది సరైనది అనిపిస్తే అదే చేస్తానని, కొందరు తమ కోరికలను అణచివేసుకున్న ఫ్రస్ట్రేషన్‌లో ఇతరులపై నిబంధనలు విధిస్తారని అభిప్రాయపడ్డారు.

తొలి వివాహం విఫలమైన తర్వాత, తన పిల్లలు కూడా 2008 నుంచి అంటే దాదాపు 16 సంవత్సరాలుగా తనకు దూరమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు దూరం కావడం తన తప్పు కాదని, కొన్ని విషయాలు అలా జరిగిపోయాయని, అయితే అందులో తన తప్పు కూడా ఉండవచ్చని అంగీకరించారు. యూఎస్‌లో నివసిస్తున్న తన పెద్ద కుమార్తెను ఒకసారి కలవడానికి వెళ్లినట్లు, పిల్లలు ఇద్దరూ తనకు ప్రాణం అని, వారిని చాలా మిస్ అవుతున్నానని చెప్పారు. అయితే, తొలి దశలో ఉన్న కమ్యూనికేషన్ క్రమంగా తగ్గి, ఇప్పుడు పూర్తిగా సున్నాకు చేరిందని తెలిపారు. పిల్లల గురించి తన స్నేహితులు, క్లాస్‌మేట్స్ ద్వారా తెలుసుకుంటానని అన్నారు. తన పిల్లలు తనకు దూరం కావడానికి తాను అంత పెద్ద తప్పు చేయలేదని, కానీ ఎవరినైనా ఒక పరిమితి వరకు మాత్రమే భరించగలమని, ఆ తర్వాత వదిలేయాల్సిందేనని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. రెండుసార్లు వివాహం చేసుకున్నప్పటికీ, అవి రెండూ సఫలం కాలేదని, హ్యాట్రిక్ ప్రయత్నించే ధైర్యం తనకు లేదని శ్రీకాంత్ అయ్యంగార్ వెల్లడించారు. ప్రస్తుతం తాను శాశ్వత బంధాలకు బదులుగా, కేవలం తోడు కోసం తాత్కాలిక కలయికలకే మొగ్గు చూపుతున్నానని అన్నారు. ఒకరికొకరు మర్యాద, గౌరవం ఉండే వృత్తిపరమైన సంబంధాలు చిత్ర పరిశ్రమలో ఉంటాయని, కానీ జీవితాన్ని పంచుకునే బంధాలు అక్కడి నుంచి లభించవని పేర్కొన్నారు.

బయటి ప్రపంచంలో బేవార్సులు ఎక్కువగా ఉంటారని, చిత్ర పరిశ్రమలో వృత్తిపరమైన నిబద్ధత ఉన్నవారు ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. తనకు కొందరు ఆత్మీయులు ఉన్నారని, వారిలో తన తమ్ముడు కరుణాకర్, క్రిష్, కళ్యాణ్ చక్రవర్తి వంటి వారు ఉన్నారని ఆయన ప్రస్తావించారు.

Also Read: ఆయన తిని వదిలేసిన చికెన్ బోన్స్ తిన్న RGV.. అదేంటని అడిగితే..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *