Mattel Barbie Dream Team Announcement: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత స్టార్ క్రికెటర్ స్మృతి మందానా (Smriti Mandhana) కు అరుదైన గౌరవం లభించింది. ప్రముఖ టోయ్ కంపెనీ మాట్టెల్ (Mattel) తన తొలి “బార్బీ డ్రీమ్ టీమ్”లో మందానాను ఎంపిక చేసింది.
ఈ అరుదైన గౌరవంతో ఆమె బార్బీ డ్రీమ్ టీమ్‌లో చోటు దక్కించుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఆమె రూపంలో ప్రత్యేకంగా రూపొందించిన బార్బీ డాల్‌ను కూడా విడుదల చేయడం విశేషం.
బార్బీ డ్రీమ్ టీమ్‌లో తొలి క్రికెటర్..
మందానా ఎంపిక మహిళల క్రీడల అభివృద్ధికి ప్రతీకగా నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్లో ఆమె సాధించిన విజయాలను గుర్తిస్తూ ఈ ప్రత్యేక బార్బీ డాల్‌ను రూపొందించారు.
ఈ కార్యక్రమం ద్వారా వివిధ రంగాల్లో గొప్ప విజయాలు సాధించిన మహిళలను గౌరవించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన మహిళల జాబితాలో భారతదేశాన్ని స్మృతి మంధానా ప్రతినిధిగా నిలిచింది.
మహిళల క్రికెట్‌కు మంధానా చేసిన సేవలు..
స్మృతి మందానా భారత మహిళా క్రికెట్ ఎదుగుదలకు కీలక పాత్ర పోషించింది. ఆమె భారత మహిళా జట్టులో అత్యంత ప్రభావవంతమైన బ్యాటర్లలో ఒకరిగా నిలిచింది. అంతేకాదు, టెస్ట్, వన్డే, టీ20 మూడు అంతర్జాతీయ ఫార్మాట్లలో శతకం సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా కూడా ఆమె రికార్డు సృష్టించింది. ఇది మహిళల క్రికెట్‌కు ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..