ఉప ముఖ్యమంత్రి భట్టి తనయుడి వివాహం.. ప్రత్యేక ఆకర్షణగా బంధువుల పాదయాత్ర

ఉప ముఖ్యమంత్రి భట్టి తనయుడి వివాహం.. ప్రత్యేక ఆకర్షణగా బంధువుల పాదయాత్ర


​తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తనయుడు సూర్య విక్రమాదిత్య – సాక్షిల వివాహ వేడుకలో ఒక అపురూప ఘట్టం చోటుచేసుకుంది. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీల మధ్య.. నాడు భట్టి విక్రమార్కతో కలిసి అడుగులేసిన సామాన్య ఆదివాసీ మహిళలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

​అడవి బిడ్డల అనుబంధం: ​గత ఎన్నికలకు ముందు సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి ఖమ్మం వరకు నిర్వహించిన పాదయాత్రలో వీరంతా భాగస్వాములయ్యారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా
​జైనూర్ మండలం బూసిమెట్ట కు చెందిన వాలే లక్ష్మీబాయి, డాకూర్ రుక్మబాయి, దుర్గ సిందు, ​ఉట్నూరు మండలం దేవగూడకు చెందినమరప గంగుబాయి, సుమన్ బాయి, సీడం లక్ష్మీబాయి. ​వీరంతా పాదయాత్ర ఆద్యంతం ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా, ఎండ తీవ్రతకు భట్టి గారు అలసిపోకుండా, ఆయనకు ఆరోగ్యం దెబ్బతినకుండా తమ సంప్రదాయ ఆదివాసీ పానీయాలను అందించి ఆత్మీయతను చాటుకున్నారు.

​మరువని కృతజ్ఞత.. పెళ్లి పీటలపై గౌరవం: ​పదవులు వచ్చినా పాత మిత్రులను మరువని భట్టి విక్రమార్క గారు, తన కుమారుడి వివాహానికి వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ​వివాహ వేడుకకు హాజరైన ఆ ఆదివాసీ మహిళలను భట్టి దంపతులు ఆప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కేవలం అతిథులుగా మాత్రమే కాకుండా, వారికి వివాహ వేదికపైనే ప్రత్యేక స్థానం కల్పించి కూర్చోబెట్టడం అందరినీ ఆకట్టుకుంది. ​రాజకీయాల్లో మానవ సంబంధాలకు, కృతజ్ఞతకు ఈ ఘటన నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *