ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల రాశీ. తొలి సినిమాతోనే తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. బబ్లీ లుక్ లో భలే ఉందే ఈ అమ్మాయి అంటూ కుర్రాళ్లంతా రాశీ అందానికి ఫిదా అయ్యారు. తొలి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. మీడియా రేంజ్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.