Headlines

Telangana: తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. 30 రకాల వైద్య పరీక్షలు ఫ్రీ.. రేవంత్ సర్కార్ సరికొత్త నిర్ణయం

Telangana: తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. 30 రకాల వైద్య పరీక్షలు ఫ్రీ.. రేవంత్ సర్కార్ సరికొత్త నిర్ణయం


తెలంగాణలోని డ్వాక్రా మహిళలకు రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. వీరికి 30 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయనుంది. మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మూడు విడతలుగా మహిళలకు ఈ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 46 లక్షల మంది మహిళలకు ఉచితంగా హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాల సహకారంతో టెస్టులు చేయనుండగా.. ఆరు నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. తొలి విడతలో ప్రతి జిల్లా నుంచి 5 మండలాలను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత మరో 10 మండలాలను ఎంచుకుంటారు.

చివరి దశలో మిగిలిన మండలాలు

ఇక చివరి దశలో మిగిలిన అన్ని మండలాల్లో డ్వాక్రా మహిళలకు ఆరోగ్య పరీక్షలు ఫ్రీగా నిర్వహిస్తారు. టెస్టులు చేసిన అనంతరం వారి హెల్త్ ప్రొపైల్ సిద్దం చేశారు. ఇక మార్చి 6 నుంచి 26వ తేదీ వరకు అంగన్‌వాడీ, స్కూళ్లల్లో పిల్లలపై ఆరోగ్య పరీక్షలు చేపడతారు. పిల్లల్లో రక్తహీనత నివారణకు ఈ పరీక్షలు దోహదపడనున్నాయి. తెలంగాణ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వైద్య రంగంలో చేపట్టాల్సిన ప్రొగ్రాంలపై సచివాలయంలో ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ చర్చించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణతో పాటు ఆరోగ్యశాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వైద్య రంగంలో రాబోయే 99 రోజుల పాటు చేపట్టాల్సిన కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్ రూపొందించడంపై చర్చించారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.

4 దశల్లో కార్యక్రమాలు

మొత్తం 4 దశల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారును మంత్రి ఆదేశించారు. రెండో దశను ఏప్రిల్ 1 నుంచి 15 వరకు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా బీపీ, షుగర్, కేన్సర్ వంటి వ్యాధులను గుర్తించేందుకు సబ్ సెంటర్ల పరిధిలో స్క్రీనింగ్ టెస్టులు చేపడతారు. ఇక డయాలసిస్ పేషెంట్లకు వైరల్ ఇన్పెక్షన్ టెస్టులు నిర్వహిస్తారు. అలాగే టీబీ కేసులను గుర్తించడంతో పాటు డే కేర్ కేన్సర్ సెంటర్లలో కిమోథెరపీ సేవలను మ్యాపింగ్ చేయనున్నారు. ఇక ఎండాకాలం వచ్చిన క్రమంలో వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని దామోదర రాజనర్సింహ అధికారులకు తెలిపారు. అలాగే అత్యవసర ముందులు సిద్దంగా ఉంచాలని సూచించారు. ఇక మే 16 నుంచి జూన్ 12 వరకు పట్టణాల్లో వైద్య సేవలను విస్తరించాలని నిర్ణయించారు. అర్బన్ పీహెచ్‌సీలను పాలీక్లీనిక్స్‌గా మార్చనున్నారు. ఇక బస్తీలలో మొబైల్ వాహనాల ద్వారా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *