Headlines

Hyderabad: వ్యాయామం చేద్దామని ఉత్సాహంగా జిమ్‌కు.. చివరకు వాష్ రూమ్‌లో ఇలా..

Hyderabad: వ్యాయామం చేద్దామని ఉత్సాహంగా జిమ్‌కు.. చివరకు వాష్ రూమ్‌లో ఇలా..


Hyderabad: వ్యాయామం చేద్దామని ఉత్సాహంగా జిమ్‌కు.. చివరకు వాష్ రూమ్‌లో ఇలా..

రోజూ లాగే జిమ్‌లో వ్యాయామం చేసేందుకు వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. అకస్మాత్తుగా కళ్లు తిరిగి కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచాడు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్ నెం.36లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన నాగండ్ల అనిల్ చౌదరి (36) హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని రోజూ జిమ్ చేసే అలవాటుంది.. రోజూలాగే బుధవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌ రోడ్ నెం.36లో ఉన్న ఏసిబో జిమ్‌నకు వెళ్లాడు. కాసేపు వర్కౌట్స్ చేసిన తర్వాత అనిల్ చౌదరి వాష్‌రూమ్‌కు వెళ్లాడు.. అయితే అక్కడ ఒక్కసారిగా స్పృహతప్పి కుప్పకూలిపోయారు. గమనించిన జిమ్ సిబ్బంది, తోటి సభ్యులు వెంటనే ఆయనకు సీపీఆర్ చేశారు.. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. స్పృహలోకి రాకపోవడంతో.. వెంటనే అనిల్ ను ఆసుపత్రికి తరలించారు.. అయితే.. ఆయన అప్పటికే గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు.

అనిల్ చౌదరి మరణవార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అప్పటివరకు ఆరోగ్యంగా ఉండి, వ్యాయామానికి వెళ్లిన వ్యక్తి ఇలా విగతజీవిగా తిరిగి రావడం వారిని కోలుకోలేని దెబ్బ తీసింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. ఇటీవల కొంతమంది గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోతున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ఓ యువకుడు సైతం షటిల్ ఆడుతూ కుప్పకూలి మరణించాడు.. ఇలాంటి ఘటనలు పెరుగుతుండటం ఆందోళనలు కలిగిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *