స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న వివాహం ఫిబ్రవరి 26న గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఉదయ్ పూర్ లో వీరి వివాహం జరిగింది. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. విజయ్, రష్మిక పెళ్లి చేసుకోవడంతో ఇద్దరి అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. ఇక పెళ్లి తర్వాత ఈ జంట విజయ్ సొంత ఊరులో సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. అలాగే ఊరి ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు. విజయ్, రష్మిక పెళ్ళికి కొద్ది మంది అతిధులు మాత్రమే హాజరయ్యారు. ఇక ఈ రోజు(మార్చి 4)న హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు.