ఈ రెండిటి తో.. మెరిసే చర్మం మీ సొంతం.. ముసలి వాళ్ళు కూడా యవ్వనంగా మారాల్సిందే

ఈ రెండిటి తో.. మెరిసే చర్మం మీ సొంతం.. ముసలి వాళ్ళు కూడా యవ్వనంగా మారాల్సిందే


ప్రతి ఒక్కరూ తమ అందాన్ని కాపాడుకోవడం కోసం మనం అనేక మార్గాలను అనుసరిస్తుంటారు. ఆధునిక జీవనశైలిలో కూడా పాతకాలపు వంటింటి చిట్కాలకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా వంటగదిలో లభించే సహజ పదార్థాలు ఆరోగ్యం, అందానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి రెండు అద్భుతమైన పదార్థాలు ఉసిరికాయ , పసుపు . ఇవి రెండూ ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత పొందినవి. చర్మ కాంతిని పెంచడంలో, శరీరాన్ని లోపల నుంచి శుభ్రపరచడంలో ఇవి విశేష పాత్ర పోషిస్తాయి. అయితే, వీటిని ఎలా?, ఎప్పుడు తీసుకోవాలి అన్నదానిపై చాలామందికి సందేహాలు ఉంటాయి. ఉసిరికాయలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది. చర్మంపై ముడతలు, సన్నని గీతలను తగ్గిస్తుంది. సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న చర్మాన్ని రిపేర్ చేసి సహజ కాంతిని అందిస్తుంది. అకాల వృద్ధాప్యాన్ని అడ్డుకోవడంలో ఇది మేటి అని చెప్పవచ్చు. అలాగే పసుపు నీరు కూడా మంచి యాంటీబయోటిక్ అని చెప్పవచ్చు. పసుపులోని కర్కుమిన్ ఒక శక్తివంతమైన యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్. ఇది రక్తాన్ని శుద్ధి చేసి, శరీరాన్ని లోపల నుండి శుభ్రపరుస్తుంది. మొటిమలు, నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. చర్మ ఇన్ఫెక్షన్లను అడ్డుకుని, రంగును సమంగా మారుస్తుంది. జిడ్డు చర్మం గలవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. నిజానికి, ఉసిరి, పసుపు రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల రెట్టింపు ఫలితం ఉంటుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో తాజాగా తీసిన ఉసిరి రసం, చిటికెడు పసుపు, కొద్దిగా అల్లం రసం కలిపి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితం ఉంటుందంటున్నారు. ఉసిరి చర్మానికి మెరుపునిస్తే, పసుపు చర్మాన్ని సమస్యల నుండి కాపాడుతుంది. క్రమం తప్పకుండా ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా, చర్మం లోపలి నుండి ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని అనుసరించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్‌..

Holi: శ్మశానంలో మండుతున్న చితుల మధ్య “హోలీ’ ఎక్కడంటే..

ఈ జంట యమా ఫాస్ట్ గురూ.. పెళ్లి చేసుకున్న గంటకే విడిపోయారు

బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!

Garikipati: తెలుగునాడుగా మార్చండి.. గరికపాటి సంచలన వ్యాఖ్యలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *