వృషభ రాశి వారి ఆదాయ వ్యయాలు చూస్తే.. ఆదాయం 5 వ్యయం 14, అవమానం 4, రాజ్య పూజ్యం 5… పరాభవ నామ సంవత్సరం వీరికి చాలా అద్భుతంగా కలిసి రానుంది. ఈ రాశి వారికి కోరిన కోర్కెలు నెరవేరుతాయి. ఊహకందని ప్రయోజనాలు అందుకుంటారు. ముఖ్యంగా దేవ గుర బృహస్పతి అర్ధాష్టమంలో, కేతువు శుభస్తానంలో సంచరించడం వలన వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది. వ్యక్తిగత జీవితం, వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మీ తెలివితేటలతో విజయాలు అందుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారు తప్పక జాబ్ సాధిస్తారు.