Song Flashback: రాలిపోయే పువ్వా పాటకు నేషనల్ అవార్డ్.. కానీ వెనక్కు ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే..

Song Flashback: రాలిపోయే పువ్వా పాటకు నేషనల్ అవార్డ్.. కానీ వెనక్కు ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే..


Song Flashback: రాలిపోయే పువ్వా పాటకు నేషనల్ అవార్డ్.. కానీ వెనక్కు ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే..

తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన దివంగత కవి, రచయిత వేటూరి సుందరరామమూర్తి. సినీరంగంలో వందలాది పాటల రాశారు. ఆయన జీవితంలోని పలు ఆసక్తికర ఘట్టాలను వేటూరి కుమారుడు రవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. జాతీయ అవార్డును ఆయన ఎందుకు తిరస్కరించారు, తెలుగు భాషకు ప్రాచీన హోదా సాధించడంలో జరిగిన కృషి, రచయితల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు, ఆయన వ్యక్తిత్వం వంటి అనేక విషయాలను వెల్లడించారు. వేటూరి సుందరరామమూర్తికి మాతృదేవోభవ చిత్రంలోని “రాలిపోయే పువ్వా” పాటకు జాతీయ అవార్డు లభించింది. అయితే, తెలుగు భాషకు అప్పట్లో ప్రాచీన భాషా హోదా కల్పించకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, అత్యంత అరుదైన ఆ అవార్డును ఆయన తిరిగి ఇచ్చేశారు. తెలుగు అంటే కేవలం భాష మాత్రమే కాదని, అది తెలుగువారి నడవడిక, ప్రాంతం, మంచితనం, ప్రజలు, వాతావరణం, సంస్కృతి అని వేటూరి గారు బలంగా నమ్మేవారని గుర్తు చేసుకున్నారు. తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించడానికి వెయ్యేళ్ల గడువు పూర్తి కాలేదని అప్పటి ప్రభుత్వం చెప్పడం ఆయనకు తీవ్ర బాధ కలిగించిందని.. తమిళం, కన్నడ భాషల మాదిరిగానే తెలుగు కూడా ప్రాచీనమైనదని, ఆధారాలు లేక నిరూపించలేకపోవచ్చు కానీ అది వాస్తవమని ఆయన వాదించారు. చివరికి, అవనిగడ్డలో జరిగిన ఒక సభలో తన పాట తెలుగు వల్లే గుర్తింపు పొందిందని, ఆ తెలుగుకే గుర్తింపు లేనప్పుడు ఈ జాతీయ అవార్డు తనకు అవసరం లేదని ప్రకటించి వెనక్కి ఇచ్చేశారని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా బాబూ.. నరాలు తెగిపోయే సస్పెన్స్, ట్విస్టులు. ఓటీటీలో దుమ్మురేపుతుంది..

తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడంలో వేటూరి తండ్రిగారి సోదరుడైన ప్రభాకర్ శాస్త్రి చేసిన పరిశోధన కీలకపాత్ర పోషించిందని రవి వెల్లడించారు. 9వ శతాబ్దంలో పంపన అనే తెలుగు కవి రాసిన మొదటి తెలుగు రచనకు సంబంధించిన ఆధారాలను ప్రభాకర్ శాస్త్రి సేకరించి, కోర్టులో సమర్పించారని అన్నారు. మద్రాసు హైకోర్టులో ఒక తమిళుడు కేసు వేసి తెలుగుకు ప్రాచీన హోదా రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, ఈ ఆధారాలతో తెలుగు భాషకు ఏన్షియంట్ లాంగ్వేజ్ గుర్తింపు లభించింది. ఇది వేటూరి మొండితనం, ప్రభాకర్ శాస్త్రి పరిశోధన ఫలితంగా వచ్చిన దైవ సంకల్పమే అని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్‏గా నటించింది ఆ స్టార్ హీరోనా.. ? అస్సలు ఊహించలేదుగా.

వేటూరి గారి ఆర్థిక నేపథ్యం విషయానికి వస్తే, ఆయన తండ్రి వైపు నుంచీ, తల్లి వైపు నుంచీ భారీ ఆస్తులున్న జమిందారీ కుటుంబానికి చెందినవారు. ఆయన చిన్న జమిందార్‌గా పిలవబడేవారని, వందల ఎకరాల ఆస్తి ఉండేదని రవి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వేటూరిని భుజాలపై ఎక్కించుకొని నృత్యం చేసేవారని, ఆయన టీచర్ల మీద పద్యాలు రాసి చదివేవారని గుర్తు చేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : అమీర్ పేట్ మెట్రో పక్కన ఉన్న సారథి స్టూడియో మాదే.. కానీ.. టాలీవుడ్ నటుడు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *