హోలీ రోజున భాంగ్, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. అలాగే, AI వీడియోలతో కూడా జాగ్రత్తగా ఉండండి. ఏదైన వీడియోని ఒకటికి రెండుసార్లు చూసి ఏదో నిజం, ఏది అబద్ధం చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు కూడా ఈ చిరుతపులి నిజమని నమ్మితే ప్రమాదం. సరద కోసం ఇలాంటి ట్రై చేశారంటే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. హోలీ వేళ మీలో మీరు రంగులు చల్లుకుంటే పర్వాలేదు.. కానీ, ఇలాంటి ప్రమాదకరమైన జంతువులతో ఆటలు మీ ప్రాణాలకే ప్రమాదం కావొచ్చు. ముఖ్యంగా కొన్న జర్మన్ షెపర్డ్, పిట్‌బుల్ రకం వంటి పెంపుడు కుక్కలతో కూడా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీహార్ పేరుతో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియో ఒకటి అందరినీ అయోమయం గందరగోళంలోకి నెట్టివేస్తుంది.
వైరల్ వీడియోలో చీతా ఒకటి బిహార్‌లోని ఒక గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చింది. దాంతో గ్రామవాసులంతా కలిసి ఆ చీతాతో హోలీ ఆడినట్టుగా వీడియోలో కనిపిస్తుంది. అయితే, వాస్తవం అది కాదు..ఈ వీడియో పూర్తిగా AI క్రియేషన్. CGI (కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెస్) ఆధారంగా తయారైంది. స్థానిక అధికారులు కూడా దీన్ని ధృవీకరించారు. ఏ చీతా కూడా గ్రామంలో హోలీ ఆడేందుకు రాలేదని స్పష్టంచేశారు.
ఇవి కూడా చదవండి
సోషల్ మీడియాలో వీడియోను చూసిన కొంతమంది నెటిజన్లు సరదాగా కామెంట్లు చేశారు. మరికొందరు భయంతో తీసుకున్నారు. వాస్తవానికి, చీతాలని ప్రజల మధ్యలోకి తీసుకురావడం, గ్రామస్తులతో కలిసి హోలీ, ఇతర ఆటలు ఆడించడం ప్రమాదకరమే. ఇలాంటి AI వీడియోలు ప్రజల్ని వాస్తం అనుకుని భ్రమ పడేలా చేస్తుండటం ఇప్పుడు కొత్త సమస్యగా మారుతోంది. ప్రముఖ fact-checking వెబ్‌సైట్లు ఈ వీడియోను పరిశీలించి ఇది ఫేక్ వీడియో అని గుర్తించారు. AI వీడియోలు రోజూ ఎక్కువగా వైరల్ అవుతున్న నేపథ్యంలో నెట్‌జన్లు వాటిని నిజమైన వీడియోలు అనుకొని షేర్ చేసుకోవడం, భయపెట్టడం సాధారణమవుతోంది.
వీడియో ఇక్కడ చూడండి…
खबर बिहार की है जहां पटना स्थित एक गांव में तेंदुआ आ गया और अगर यहां कोई और राज्य के लोग होते तो डर जाते लेकिन
बिहार में टैलेंट की कमी नहीं है वहां के लोगों ने तुरत तेंदुवा के ऊपर रंग , गुलाल लगाकर होली का त्यौहार मनाया और तेंदुवा भी पूरी तरह शांत रहा पूरी वीडियो देखिए। pic.twitter.com/mGaCvrOJQn
— Roshani Maurya (@MauryaRoshni_) March 2, 2026
వీడియోను తయారు చేసిన వారి ఉద్దేశం సరదా కోసం లేదా క్రియేటివ్ వీడియో కోసం అయినా, వాస్తవాన్ని దానితో కలపడం అనర్థకంగా మారుతోంది. నిపుణులు సూచిస్తున్నట్టు, సోషల్ మీడియాలో ఏదైనా వీడియో చూసిన వెంటనే..దాని సోర్స్, ప్రామాణికతను చెక్‌చేసుకోవడం అవసరం అంటున్నారు నిపుణులు.