Headlines

Upadi Hami Scheme: ఉపాధి హామీ కూలీలకు కొత్త రూల్.. అలా చేయకపోతే వేతనం కట్.. కేంద్రం నుంచి ఆదేశాలు

Upadi Hami Scheme: ఉపాధి హామీ కూలీలకు కొత్త రూల్.. అలా చేయకపోతే వేతనం కట్.. కేంద్రం నుంచి ఆదేశాలు


కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే ఈ పథకం పేరును మార్చడంతో పాటు పని దినాలు పెంచడం, వేతనం పెంచడం లాంటి నిర్ణయాలు తీసుకుంది. ఇక దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో పని కల్పించడంతో పాటు పనిచేసిన తర్వాత 15 రోజుల్లో వేతనం బ్యాంక్ అకౌంట్లలో జమ చేసేలా కొత్త మార్పులు చేస్తోంది. ఈ క్రమంలో ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్రం మరో కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. అదే ఫేషియల్ అథెంటికేషన్ అటెండెన్స్ విధానం. ఇప్పటివరకు ఫీల్డ్ ఆఫీసర్లు పేపర్ల ద్వారా పనికొచ్చిన లబ్దిదారుల పేర్లను నమోదు చేసుకునేవారు. కానీ కొంతమంది పనికి రాకపోయినా కొన్ని తప్పుడు మార్గాల్లో అటెండెన్స్ వేయించుకుని డబ్బులు పొందుతున్నారు. దీనిని నివారించేందుకు ముఖ హాజరును కేంద్రం తప్పనిసరి చేసింది.

మార్చి 2 నుంచి అమల్లోకి..

ఉపాధి హామీ కూలీలకు మార్చి 2వ తేదీ నుంచి ఫేషియల్ అధెంటికేషన్‌ను ఏపీ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ముఖ హాజరు వేయకపోతే కూలీలకు నగదు ఆగిపోతాయి. ఇందుకోసం ముందుగా కూలీలందరూ ఈకేవైసీ చేయించుకోవాలి. గతంలో జాబ్ కార్డులో ఒకరి పేరు ఉంటే మరొకరు పనులకు హాజరువుతున్నారు. అటెండెన్స్ అక్రమ మార్గంలో వేయించుకుని నగదు పొందుతున్నారు. దీంతో దుర్వినియోగానికి చెక్ పెట్టేందుకు ముఖ హాజరు విధానాన్ని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే జాబ్ కార్డులు కలిగి ఉన్న ప్రతీఒక్కరూ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలనే నిబంధన విధించింది. 2025 నుంచి ఈకేవైసీ ప్రాసెస్ స్టార్ట్ అవ్వగా.. ఇప్పటిరకు మెజార్టీ కూలీలు చేయించుకున్నారు.

కూలీలకు ప్రత్యేక ఐడీ

ఫేషియల్ అటెండెన్స్ విధానంలో ప్రతీ కూలీకి ఒక ఐడీ క్రియేట్ చేస్తారు. పనికి వెళ్లిన సమయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు కూలీలను ఫొటో తీస్తారు. పని పూర్తైన తర్వాత మరోసారి ఫొటోలు తీస్తారు. దీని వల్ల ముఖ హాజరు పడుతుంది. అయితే కొన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ విధానంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఫేషియల్ రికగ్నిషన్ విధానం అమలు చేయడం కష్టంగా ఉందని ఫీల్డ్ ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే పని ప్రదేశంలో కూలీల ఫొటో తీసి సిగ్నల్ వచ్చే ప్రాంతానికి వెళ్లి ఫొటోలు యాప్‌లో అప్‌లోడ్ చేయాలని ఫీల్డ్ ఆఫీసర్లకు అధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో ఈ పద్దతిని అనుసరిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *