Cinema : బాబోయ్.. దృశ్యం సినిమాను మించిన ట్విస్టులు.. సీన్ టూ సీన్ ఊహించని సస్పెన్స్.. తెలుగులో బ్లాక్ బస్టర్..

Cinema : బాబోయ్.. దృశ్యం సినిమాను మించిన ట్విస్టులు.. సీన్ టూ సీన్ ఊహించని సస్పెన్స్.. తెలుగులో బ్లాక్ బస్టర్..


సాధారణంగా చాలా సినిమాలు థియేటర్లలో సూపర్ హిట్ అయ్యాయి. కానీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకున్న పలు చిత్రాలు ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. కానీ మీకు తెలుసా.. ? ఒక సినిమా మాత్రం అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో రెండింటిలోనూ సూపర్ హిట్ అయ్యింది. అది అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో ఇప్పటివరకు మొత్తం మూడు భాగాలు విడుదలైన భారీ విజయాన్ని సాధించాయి. ఓటీటీలో థ్రిల్లింగ్ సినిమాలు చూడడానికి ఇష్టపడేవారికి ఈ మూవీ స్పెషల్ ట్రీట్ అనే చెప్పాలి. మనం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు ‘హిట్ ది ఫస్ట్ కేస్’. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా 2020లో విడుదలైంది. విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : అమీర్ పేట్ మెట్రో పక్కన ఉన్న సారథి స్టూడియో మాదే.. కానీ.. టాలీవుడ్ నటుడు..

‘హిట్ ది ఫస్ట్ కేస్’ చిత్రంలో రుహాని శర్మ కథానాయికగా నటించింది. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. సినిమా విషయానికి వస్తే.. హీరో విశ్వక్ సేన్ ఒక పోలీస్ ఆఫీసర్. తన ప్రియురాలితో గొడవల కారణంగా విడిపోతాడు. ఆకస్మాత్తుగా ఒకరోజు అతని స్నేహితురాలు కనిపించకుండా పోతుంది. ఆమెలాగే మరో యువతి సైతం కిడ్నాప్ అవుతుంది. ఈ రెండు కిడ్నాప్ సంఘటనలకు సంబంధం ఉందని గుర్తిస్తాడు హీరో. ఈ కేసులపై దర్యాప్తు ప్రారంభిస్తాడు. ఆ సమయంలోనే అమ్మాయిలను ఎవరు కిడ్నాప్ చేసారు? చివరికి వాళ్ళు దొరికారా? లేదా? ఇదే ఈ సినిమా కథ.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రామ్ చరణ్‏ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని.. అప్పుడే ప్రభాస్‏కు చెప్పా.. టాలీవుడ్ నటుడు..

ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఆద్యంతం సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. ముఖ్యంగా దృశ్యం సినిమాను మించిన ట్విస్టులతో సాగుతుంది. హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ రుహానీ శర్మ తదితరులు అద్భుతమైన నటనను కనబరిచారు. ఉత్కంఠభరితంగా సాగే కథలో క్లైమాక్స్ సన్నివేశం ఆశ్చర్యకరంగా మారుతుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇక ఈ సినిమా తర్వాతి రెండు భాగాలు, హిట్ 2, హిట్ 3 సైతం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా బాబూ.. నరాలు తెగిపోయే సస్పెన్స్, ట్విస్టులు. ఓటీటీలో దుమ్మురేపుతుంది..

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్‏గా నటించింది ఆ స్టార్ హీరోనా.. ? అస్సలు ఊహించలేదుగా.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *