టీవీ సీరియల్స్ నటీనటులకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సీరియల్ హీరోయిన్లకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. బుల్లితెరపై పద్దతిగా చీరకట్టులో కనిపించే ముద్దుగుమ్మలు.. నెట్టింట మాత్రం గ్లామరస్ ఫోటోలతో మెంటలెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే.. టీవీ సీరియల్స్ లో నటించి కోట్లు సంపాదించిన తారలు చాలా మంది ఉన్నారు. మన దేశంలోనే అత్యధిక ఆస్తులు ఉకన్న సీరియల్ నటి ఎవరో మీకు తెలుసా..? ఆమె ఏకంగా రూ.250 కోట్లకు మహారాణి. ఆమె పేరు జన్నత్ జుబైర్. ఆమె అత్యంత ధనిక సీరియల్ హీరోయిన్. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ. 250 కోట్లు. చిన్నప్పటి నుంచి సీరియల్స్ చేస్తూ తనదైన ముద్ర వేసింది. 2001లో ముంబైలో జన్మించింది. ఆషికి, ఫుల్వా వంటి సీరియల్స్ ద్వారా స్మాల్ స్క్రీన్ పై సందడి చేసింది.
ఎక్కువమంది చదివినవి : Tollywood : అమీర్ పేట్ మెట్రో పక్కన ఉన్న సారథి స్టూడియో మాదే.. కానీ.. టాలీవుడ్ నటుడు..
జన్నత్ తర్వాత సెకండ్ ప్లేస్ ఉన్న తార.. శ్వేతా తివారీ. బుల్లితెరపై ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. నటనతో పాటు, ఆమె చాలా అందంగా కూడా ఉంటుంది. నివేదికల ప్రకారం, శ్వేతా ఆస్తుల విలువ రూ. 81 కోట్లు. ఆమెకు ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆమెకు BMW 7 సిరీస్ 730Ld (సుమారు ₹1.38 కోట్లు), ఆడి A4 (సుమారు ₹47.60 లక్షలు) కార్లు ఉన్నాయి.
ఎక్కువమంది చదివినవి : Tollywood : రామ్ చరణ్‌ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని.. అప్పుడే ప్రభాస్‌కు చెప్పా.. టాలీవుడ్ నటుడు..
ఆ తర్వాతి స్థానంలో నియా శర్మ ఉన్నారు. ఇప్పటివరకు హిందీలో అనేక సీరియల్స్ చేసింది. అలాగే టీవీలో పలు షోలకు హోస్ట్ చేసింది. ఆమె ఆస్తుల విలువ రూ.70 కోట్లు ఉంటుందని అంచనా. ఆమె నాగిన్ 4, జమై రాజా, ఏక్ హజారోన్ మే మేరీ బహనా హై, ఇష్క్ మే మర్ జవాన్ వంటి సీరియల్స్ చేసింది. తర్వాత హీనా ఖాన్ నాలుగో స్థానంలో ఉన్నారు. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.52 కోట్లకు పైగానే ఉన్నాయని టాక్.
ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా బాబూ.. నరాలు తెగిపోయే సస్పెన్స్, ట్విస్టులు. ఓటీటీలో దుమ్మురేపుతుంది..
ఎక్కువమంది చదివినవి : Nagarjuna : హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్‌గా నటించింది ఆ స్టార్ హీరోనా.. ? అస్సలు ఊహించలేదుగా.