EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. మార్చి 31లోగా అకౌంట్లోకి డబ్బులు.. మీకు ఎంత వస్తుందో చూసుకోండిలా..

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. మార్చి 31లోగా అకౌంట్లోకి డబ్బులు.. మీకు ఎంత వస్తుందో చూసుకోండిలా..


దేశవ్యాప్తంగా ఉన్న ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. త్వరలోనే పీఎఫ్ డిపాజిట్లపై కేంద్ర ప్రభుత్వం వార్షిక వడ్డీని జమ చేసేందుకు సిద్దమవుతోంది. వీటిని నేరుగా పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో త్వరలో వేయనుంది. పీఎఫ్ బ్యాలెన్స్‌పై ప్రతీ ఏడాది వడ్డీ అందుతూ ఉంటుంది. ఎంత వడ్డీ చెల్లించాలనేది ఆర్ధిక సంవత్సరం చివర్లో నిర్ణయిస్తారు. 2025-26 ఆర్ధిక సంవత్సరంకు సంబంధించి వడ్డీ రేటును ఈపీఎఫ్‌వో ఇప్పటికే నిర్ణయించింది. మార్చి 2న జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో 8.25 శాతం వడ్డీ అందించాలని నిర్ణయించారు. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఈ సమావేశం జరగ్గా.. వరుసగా మూడో ఏడాది కూడా 8.25 శాతం వద్దే వడ్డీ కొనసాగించారు. ఈపీఎఫ్‌వో ఈ నిర్ణయాన్ని కేంద్ర ఆర్ధికశాఖ ఆమోదానికి పంపనుంది. ఆర్ధికశాఖ ఆమోదం తర్వాత వడ్డీని ఖాతాదారుల అకౌంట్లలో జమ కానుంది.

వడ్డీ ఎలా లెక్కిస్తారు..?

ఈపీఎఫ్‌వో ఆర్ధిక సంవత్సరం చివరిలో వడ్డీని ఖాతాదారుల అకౌంట్లో జమ చేయనుంది. వడ్డీని ఎలా లెక్కిస్తారంటే.. నెలావారీ డిపాజిట్ల ప్రాతిపదికన తీసుకుంటారు. నెలవారీ బ్యాలెన్స్ ఆధారంగా లెక్కిస్తారు. 8.25 శాతంను నెలవారీ రేటుగా మార్చి ఎంత ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. నెలవారీ ముగింపు నిల్వలు ఎంత ఉన్నాయనేది లెక్కించి వడ్డీని జమ చేస్తారు. ఉదాహరణకు 8.25 శాతంను నెలవారీగా విభజిస్తే 8.25%/12=0.6875 శాతం అవుతుంది. మీ పీఎఫ్ నెలవారీ బ్యాలెన్స్‌ ఆధారంగా దీనిని లెక్కిస్తారు. ముందు నెలలో వచ్చిన వడ్డీ వచ్చే నెల బ్యాలెన్స్‌లో చేరితే కాంపౌండింగ్ కూడా లెక్కిస్తారు. ప్రతీ ఏడాది మార్చి 31న వీటిని పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లో జమ చేయనున్నారు.

పీఎఫ్ అకౌంట్ యాక్టివ్‌గా ఉందా..?

మీ పీఎఫ్ అకౌంట్ మూడు సంవత్సరాల పాటు యాక్టివ్‌గా లేకపోతే ఆటోమేటిక్‌గా సిస్టమ్ ఇనాక్టివ్ చేస్తోంది. ఇలాంటి సమయంలో వడ్డీ చెల్లింపులు ఆగిపోయే అవకాశముంది. మీరు ఉద్యోగాలు మారడం లేదా వేరే కంపెనీకి మారినప్పుడు ట్రాన్స్‌ఫర్ చేయకపోవడం, కాంట్రిబ్యూషన్స్ చేయకపోవడం వంటి కారణాలతో అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది. దీంతో మీరు కేవైసీ సమర్పించి అకౌంట్‌ను యాక్టివ్ చేసుకోవాల్సి ఉంటుంది. వడ్డీ జమ అయిన తర్వాత ఈపీఎఫ్‌వో పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్, ఎస్‌ఎంఎస్, మిస్డ్ కాల్ సౌకర్యం ద్వారా మీరు పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.  కాగా ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ రేటులో కోత విధిస్తారనే వార్తలు వినిపించాయి. కానీ కేంద్రం అలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో చందాదారులకు ఊరట కలిగినట్లయిందని చెప్పవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *