హైటెన్షన్: విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు.. అసలేం జరిగిందంటే

హైటెన్షన్: విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు.. అసలేం జరిగిందంటే


అధికార యంత్రాంగం అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. HPCL గ్యాస్ ను తరలిస్తున్న గూడ్స్ రైలు లోని ఓ వ్యాగిన్ నుండి గ్యాస్ లీక్ అయింది. అయితే దానిని సకాలంలో గుర్తించిన అధికారులు రైలును నిలుపుదల చేసి మరమ్మత్తులు చేపట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఈ ఘటన శ్రీకాకుళంలో చోటు చేసుకుంది.

విశాఖపట్నం లోని HPCL రిఫైనరీ సెంటర్ లో HPCL గ్యాస్ ను లోడ్ చేసుకుని ఓ గూడ్స్ రైలు హౌరా వైపుకు వెళుతుండగా శ్రీకాకుళo జిల్లా ఉర్లాం వద్ద రైలులోని ఓ వ్యాగిన్ నుండి గ్యాస్ లీక్ అవుతున్నట్టు సిబ్బంది గుర్తించారు. అయితే రైలును శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం తిలారు రైల్వే స్టేషన్ కు తరలించి అక్కడ నిలిపివేశారు. వెంటనే రైల్వే, పోలీస్, రెవెన్యూ,అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం అయ్యారు.

రైల్ ఇంజన్ నుండి 16వ వ్యాగిన్ కి పై భాగంలో లీక్ ను గుర్తించారు. ఆ వ్యాగిన్ కి వెనుక ఉన్న బోగీలను తప్పించి కొంత ముందుకు ట్రైన్ ను తీసుకువెళ్ళారు. అక్కడ కాసేపు విద్యుత్ సరఫరా నిలిపివేసి వ్యాగిన్ లీకేజీని బాగు చేశారు. అనంతరం నాణ్యత ప్రమాణాలను పూర్తి స్థాయిలో పరిసీలించాక తిరిగి రైలు బయలుదేరింది. సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే గూడ్స్ రైలు తిలారు రైల్వే స్టేషన్ వద్ద చాలా సేపు నిలిచిపోవడంతో అటుగా ప్రయాణించే పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *