Horoscope Today: హమ్మయ్య.. వారికి ఆర్థిక సమస్యల నుంచి ఊరట.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: హమ్మయ్య.. వారికి ఆర్థిక సమస్యల నుంచి ఊరట.. 12 రాశుల వారికి రాశిఫలాలు


దిన ఫలాలు (మార్చి 4, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఇతరులకు ఆర్థిక సహాయం చేయాల్సి వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగుతుంది, అయితే వ్యాపార రంగంలో కొంత శ్రమ పెరిగే అవకాశముంది. మిథున రాశి వారు చేపట్టే ఆర్థిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆకస్మిక ధనలాభం కూడా కలగవచ్చు.

మేషం నుండి మీనం వరకు మొత్తం 12 రాశుల వారికి బుధవారం రోజున గ్రహస్థితి ఎలా ప్రభావం చూపనుందో తెలుసుకుందాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి కొన్ని శుభ వార్తలు వింటారు. కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టపోతారు. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉండే అవకాశం ఉంది. వృత్తి జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశముంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాలు ఆశించిన దానికంటే ఎక్కువగా కలిసి వస్తాయి. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. రావలసిన బాకీలు, బకాయిలన్నీ వసూలవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. మిత్రుల సాయంతో ముఖ్యమైన వ్యవహారాలు అన్నిటినీ పూర్తి చేయగలుగుతారు. జీవిత భాగస్వామికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొందరు బంధువుల వల్ల ఒత్తిడికి గురవుతారు. సామాజికంగా ఆశించిన గుర్తింపు లభిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా శ్రమ, ఒత్తిడికి అవకాశం ఉంది. పని భారం పెరిగి ఇబ్బంది పడతారు. వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది. కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులకు అండగా నిలబడడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా పురోగమిస్తాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. అనుకున్న పనుల్లో ఆలస్యాలుంటాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో ఆశించిన విధంగా పదోన్నతి లభించవచ్చు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. అనుకున్న పనులు చాలావరకు పూర్తవుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆర్థిక ప్రయత్నాలు బాగా సానుకూలపడతాయి. వివాహ సంబంధం నిశ్చయం అవుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత మరింతగా పెరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. కుటుంబపరంగా అభివృద్ధి ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఇతరుల విమర్శల్ని పట్టించుకోకపోవడం మంచిది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రత్యేక బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. కుటుంబపరంగా శుభ వార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. మిత్రులు, సహచరుల వల్ల ఇబ్బందులు ఉండవచ్చు. పిల్లలు విజయాలు సాధిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. వ్యక్తిగత విషయాల్లో సహనంతో వ్యవహరించడం మంచిది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. మనసులోని కోరికలు నెరవేరుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిళ్లు, వేధింపులుంటాయి. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విదేశాలలో స్థిరపడిన పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. సహోద్యోగులకు బాగా సహాయపడతారు. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం అవసరం. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో కొద్దిపాటి పని భారం ఉండే అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. జీవిత భాగస్వామికి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త వింటారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *