కోడికి అంత్యక్రియలు చేయడం ఎక్కడైనా చూశారా..? అవును.. అల్లారు ముద్దుగా పెంచుకున్న టర్కీ కోళ్లలో ఓ కోడి చనిపోతే.. మరో కోడి మృతిచెందిన కోడిపై పడి పదేపదే లేపుతూ తల్లడిల్లడం ప్రతి ఒక్కరి హృదయాలను చెలింపచేసింది.. ఆ తండా వాసులను కంటతడి పెట్టించింది. చివరకు.. ఆ టర్కీ కోడిని పెంచుకుంటున్న యాజమాని చనిపోయిన కోడికి అంతిమ సంస్కారాలు చేసి రుణం తీర్చుకున్నాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా లక్ష్మీపురం శివారు గమ్య తండాలో జరిగింది. భూక్యా వీరన్న అనే గిరిజన రైతు రెండేళ్ల క్రీతం రెండు టర్కీ కోడి పిల్లలను తెచ్చుకొని పెంపుడు జంతువులుగా పెంచుకుంటున్నాడు.
2 కోళ్లు తమకు విశ్వాసమైన పెంపుడు జంతువులుగా మారాయి.. వాటిని తమ కుటుంబసభ్యుల వలే.. అపురూపంగా పెంచుకుంటున్నారు. ఆ రెండు టర్కీ కోళ్లు తోబుట్టువులా అత్యంత ఆప్యాయంగా పెరుగుతున్నాయి.. వాటిలో ఓ కోడి హఠాత్తుగా మృతి చెందింది.. ఈ క్రమంలో ఊహించని సన్నివేశం తండా వాసులను తల్లడిల్లిపోయేలా చేసింది. తనతో కలసి మెలసి తిరిగిన కోడి మరణాన్ని తట్టుకోలేని మరో కోడి.. మృతి చెందిన కోడిని పదేపదే లేపుతూ కన్నీరు మున్నీరుగా విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ప్రేమ ఆప్యాయతలు, అనుబంధాలు మనుషుల్లోనే కాదు.. మూగ జీవుల్లోను ఉంటాయాని నిరూపించింది ఈ టర్కీ కోడి..
వీడియో చూడండి..
మృతి చెందిన కోడికి అతిమ సంస్కారాలు చేసిన యాజమాని దాని రుణం తీర్చుకున్నాడు.. అయితే.. అంతిమ సంస్కారాలు చేస్తున్న సమయంలో ఇంటినుంచి మృతిచెందిన కోడిని తీసుకెళ్తుంటే మరొకోడి వెంబడించిన తీరు తండావాసులను కన్నీరు పెట్టించింది. మృతిచెందిన కోడికి అంత్యక్రియలు నిర్వహించి వీరన్న దంపతులు.. తమ పెంపుడు జంతువు పై మమకారం చాటుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..