నటి శ్రీలీల ప్రస్తుతం తన కెరీర్‌లో ఒక కీలక దశలో ఉన్నారు. అకడమిక్స్‌లో విజయం సాధించినప్పటికీ, సినిమాల పరంగా ఆమెకు ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవసరం అని చర్చ జరుగుతోంది. కెరీర్ ప్రారంభంలో దూసుకుపోయిన శ్రీలీల, ఇటీవల విడుదలైన కొన్ని చిత్రాలతో ఆశించినంత విజయం సాధించలేకపోయారు. 2024 చివర్లో పుష్ప సీక్వెల్‌లోని కిస్సిక్ పాటతో వార్తల్లో నిలిచినా, 2025లో వచ్చిన జూనియర్, మాస్ జాతర, రాబిన్ హుడ్ వంటి చిత్రాలు ఆమె కెరీర్‌కు ప్రత్యేకంగా విలువను చేర్చలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ సినిమాలలోని పాటలు, కాస్ట్యూమ్స్ ఆకట్టుకున్నప్పటికీ, అవి ఆమె భవిష్యత్‌కు పెద్దగా దోహదపడలేదనే మాట వినిపిస్తోంది. అందుకే శ్రీలీల 2026 నాటి ప్రాజెక్టులపై మరింత జాగ్రత్తగా దృష్టి సారిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :