హైదరాబాద్, మార్చి 3: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లలో ఆర్‌ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ రాత పరీక్ష సీబీటీ 1 మార్చి 6వ తేదీ నుంచి మొదలవనుంది. ఈ క్రమంలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్బీ) అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను విడుదల చేసిన బోర్డు పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్ధులు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ ఆన్‌లైన్ పరీక్షలు మార్చి 6, 9, 10, 13 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో రోజుకు మూడు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు.
ఇటీవలే పరీక్షల రివైజ్‌డ్ ఎగ్జామ్స్ తేదీలను ఆర్‌ఆర్‌బీ విడుదల చేసింది. గతంలో (జనవరిలో) విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి 5 నుంచి 9 వరకు ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఈ తేదీలను తాజాగా ఆర్‌ఆర్‌బీ మార్చింది. దీంతోఒక రోజు తర్వాత నుంచి పరీక్షలు మొదలవనున్నాయి. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 6,238 టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, తదితర విభాగాల్లో టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్‌లైన్ రాతపరీక్ష, వైద్య పరీక్షలు ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది.
ఆర్‌ఆర్‌బీ రైల్వే టెక్నీషియన్ సీబీటీ 1 అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.