Suhas: ఆ స్టార్ హీరోయిన్ పక్కన ఇతనా అన్నారు.! సెట్‌లోనే అవమానిస్తే.. ఫుల్‌గా ఏడ్చేశాను

Suhas: ఆ స్టార్ హీరోయిన్ పక్కన ఇతనా అన్నారు.! సెట్‌లోనే అవమానిస్తే.. ఫుల్‌గా ఏడ్చేశాను


నటుడు సుహాస్ తన సినీ ప్రస్థానంలో ఎదురైన అనేక సవాళ్లు, అవమానాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మజిలీ చిత్రం భారీ విజయం సాధించిన తర్వాత కూడా తాను వ్యక్తిగత అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని, అయితే అవే తన విజయానికి బలమైన ప్రేరణగా మారాయని ఆయన అన్నారు. సుహాస్ తన అనుభవాన్ని వివరిస్తూ, మజిలీ తర్వాత తనకు అవకాశాలు వస్తున్న రోజుల్లో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ‘ఉప్పు కప్పురంబు’ అనే చిత్రంలో ఆమెకు క్లోజ్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో కనిపించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. షూటింగ్ సెట్‌లో ఒక వ్యక్తి ఆయనను ఉద్దేశించి, “అదేంటి, అందులో కీర్తి సురేష్ హీరోయిన్. కీర్తి సురేష్‌తో నువ్వు ఇంత క్లోజ్‌గా ఉండటమా? అసలు హీరోయిన్ పక్కన ఉండే క్యారెక్టర్ ఇతనికి ఇస్తావా?” అంటూ అవమానకరంగా మాట్లాడాడని సుహాస్ తెలిపారు. ఈ మాటలు తనను ఎంతగానో బాధించాయని, ఆ రోజు తన స్నేహితుడు సందీప్ దగ్గరికి వెళ్లి ఏడ్చేశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఏదో ఒక పని చేసుకుని బతుకుదామని, ఈ సినీ ఇండస్ట్రీ తనకు సరికాదని కూడా ఆలోచించినట్లు సుహాస్ వెల్లడించారు.

అయితే, కాలక్రమేణా అలాంటి చేదు అనుభవాలు తనను మరింత దృఢంగా మార్చాయని, అవి తనలో కసిని పెంచాయని సుహాస్ పేర్కొన్నారు. తనను నిరాశపరిచిన వ్యక్తులే తన ఎదుగుదలకు కారణమయ్యారని, అలాంటి “సో” అనేవాళ్లే చాలా మందికి స్ఫూర్తి అని ఆయన అన్నారు. ఆ సంఘటన గురించి తాను ఇప్పటివరకు కీర్తి సురేష్‌తో చెప్పలేదని, ఆమె చాలా మంచి మనసున్న వ్యక్తి అని, తన అభిమానాన్ని కోల్పోకుండా ఆమె గౌరవాన్ని కాపాడడానికే ఆ విషయాన్ని చెప్పలేదని సుహాస్ వివరించారు. కీర్తి సురేష్ నటనకు తాను ఎంత అభిమానో, ఆమె రియల్ బిహేవియర్‌కు కూడా అంతే అభిమానిని అని ఆయన ప్రశంసించారు. తన కెరీర్ తొలినాళ్లలో “నీకెందుకురా సినిమాలు? నువ్వు హీరో ఏంటి?” అంటూ చాలా మంది అవమానపరిచారని సుహాస్ గుర్తు చేసుకున్నారు. హార్డ్ వర్క్, టాలెంట్ లేకుండా ఎవరూ ఏ పొజిషన్‌కు రాలేరని తాను బలంగా నమ్ముతానన్నారు. యూట్యూబ్ నుంచి సినిమా హీరోగా మారిన తన జర్నీ అనేక మందికి స్ఫూర్తినిస్తోందని సుహాస్ పేర్కొన్నారు.

ఇది చదవండి: ఇక వార్ వన్‌సైడేరోయ్.! సెమీస్‌కు ముందే టీమిండియాకు 5 గుడ్‌న్యూస్‌లు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *