బీట్రూట్… ఇది కేవలం కూరగాయ మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఉపయోగపడే సహజ ఔషధం అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. బీట్రూట్ పుష్కలమైన పోషకాలను కలిగి ఉంటుంది. క్రమం తప్పకుండా వీటిని మీ ఆహారంలో భాగంగా తీసుకుంటే..రక్తపోటు నుంచి గుండె ఆరోగ్యం వరకు అనేక సమస్యలకు సహజ పరిష్కారంగా పనిచేస్తాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారికి బీట్రూట్ తినడం చాలా మంచిది. ఇందులో ఉన్న కార్బోహైడ్రేట్లు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ప్రతిరోజూ బీట్రూట్ తింటే శక్తి స్థాయిలు పెరుగుతాయి. బీట్రూట్ను వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. కావాలంటే సలాడ్లు, జ్యూస్‌ల రూపంలో కూడా వీటిని సులభంగా తీసుకోవచ్చు. బీట్రూట్తో తయారు చేసే టేస్టీ జ్యూస్‌లు ఇక్కడ చూద్దాం..
కేవలం బీట్రూట్ ముక్కలను గ్రైండ్ చేసి బీట్రూట్ జ్యూస్ తయారు చేస్తారు. బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల బాడీకి కావాల్సిన శక్తి లభిస్తుంది. బీట్రూట్, క్యారెట్ రెండు కలిపి జ్యూస్ తయారు చేయవచ్చు. ఈ జ్యూస్ తాగడానికి రుచికరంగా ఉంటుంది. క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తాగితే రక్తహీనత తగ్గుతుంది.
బీట్రూట్, అల్లం: బీట్రూట్లో అల్లం కలిపి జ్యూస్ తయారు చేసుకుని తాగొచ్చు. బీట్రూట్, అల్లం జ్యూస్ తాగితే జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
ఇవి కూడా చదవండి
బీట్రూట్, యాపిల్ జ్యూస్: బీట్రూట్ ముక్కలు, యాపిల్ ముక్కలు కలిపి టేస్టీ జ్యూస్ తయారు చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ హెల్త్‌ను కాపాడుతుంది.
బీట్రూట్, పుదీనా: బీట్రూట్ ముక్కల్లో పుదీనా ఆకులు కలిపి జ్యూస్ తయారు చేసుకోవాలి. ఈ జ్యూస్ టేస్టీగా ఉంటుంది.
బీట్రూట్, నిమ్మరసం:బీట్రూట్ జ్యూస్‌లో నిమ్మరసాన్ని కలిపితే టేస్ట్ బాగుంటుంది. వీటిలోని పోషకాలు ఇమ్యూనిటీ పెంచుతాయి.
బీట్రూట్, దానిమ్మ: బీట్రూట్ ముక్కలు, దానిమ్మ గింజలు కలిపి మిక్సీ పట్టాలి. ఈ జ్యూస్ టేస్టీగా ఉంటుంది. బీట్రూట్, దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల హీమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి.
బీట్రూట్, టమాటా: బీట్రూట్ ముక్కల్లో టమాటా ముక్కలు కలిపి జ్యూస్ చేసుకుని తాగొచ్చు. ఇది టేస్టీగా ఉంటుంది.
ఖాళీ కడుపుతో: బీట్రూట్ జ్యూస్‌ను తాగేటప్పుడు ఖాళీ కడుపుతో తాగితే మంచిది. పోషకాలు బాగా అందుతాయి. హెల్తీగా ఉండొచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..