టీ20 ప్రపంచకప్ 2026 ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. వెస్టిండీస్‌పై అద్భుత విజయం సాధించి టీమిండియా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. మార్చి 5వ తేదీన ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియంలో భారత్ తన సెమీఫైనల్ పోరును ఇంగ్లాండ్‌తో తలపడనుంది. వరుసగా మూడోసారి ఈ రెండు జట్లు సెమీఫైనల్లో తలపడడం విశేషం. 2022లో ఇంగ్లాండ్ భారత్‌ను ఓడించి కప్ గెలుచుకోగా, 2024లో భారత్ ఇంగ్లాండ్‌ను ఓడించి కప్ కైవసం చేసుకుంది. ఇప్పుడు 2026లో కూడా ఈ రెండు జట్లు తలపడుతుండడం ప్రపంచకప్ చరిత్రలో ఒకే ప్రత్యర్థితో వరుసగా మూడు సెమీఫైనల్స్ ఆడడం అరుదైన అంశంగా నిలిచింది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియాకు ఐదు గుడ్ న్యూస్‌లు ఉన్నాయి.
మొదటిది, స్వదేశంలో టీ20 ప్రపంచకప్ గెలవని రికార్డును బద్దలు కొట్టడానికి, అలాగే వరుసగా రెండు టైటిల్స్ సాధించడానికి టీమిండియా రెండు అడుగుల దూరంలో ఉంది. ఫైనల్‌కు చేరి గెలిస్తే, ఈ అరుదైన ఘనతను సాధించిన జట్టుగా టీమిండియా నిలుస్తుంది. రెండోది, కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన సంజూ శాంసన్, వెస్టిండీస్‌పై 97 పరుగులు చేసి కీలక సమయంలో ఫామ్ అందుకున్నాడు. ఇది జట్టుకు గొప్ప శుభ పరిణామం. మూడోది, బ్యాటింగ్ ఆర్డర్లో తిలక్ వర్మ ఐదో స్థానంలో వచ్చి అద్భుతంగా రాణిస్తున్నాడు. గతంలో మూడో స్థానంలో ఆడిన తిలక్, ఐదవ స్థానంలో రావడంతో జట్టుకు బాగా కలిసి వచ్చింది. జింబాబ్వేతో మ్యాచ్‌లో పవర్ హిట్టింగ్తో 44 పరుగులు చేయగా, వెస్టిండీస్‌పై కీలక మ్యాచ్‌లో స్కోర్‌బోర్డు నెమ్మదిగా ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చి ఒక్కసారిగా పరుగులు వేగం పెంచాడు. మధ్య ఓవర్లలో టీమిండియాకు ఇది అద్భుతంగా సెట్ అయింది. నాలుగోది, వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌పై గతంలో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఐదోది, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేకపోవడం, ఒకవేళ వర్షం వచ్చినా రిజర్వ్ డే ఉండటం టీమిండియాకు కలిసి వచ్చే అంశాలు. ఈ సానుకూల అంశాలు ఇంగ్లాండ్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకోవడానికి భారత జట్టుకు తోడ్పడనున్నాయి.
ఇది చదవండి: రాత్రి 11 గంటల వరకు మేల్కొనే ఉన్నాడు.. కట్ చేస్తే.. తెల్లారి హాస్టల్ చెట్టు దగ్గర..