కావాల్సిన పదార్ధాలు : 4 కోడిగుడ్లు, ఒక కప్పు కరివేపాకు ఆకులు, ఆవాలు, జీలకర్ర, మసాలా పొడి, ఉప్పు, కారం, నూనె, పసుపు, కొత్తిమీరను తీసుకోవాలి.
ముందుగా 5 కోడిగుడ్లను తీసుకుని వాటికి వంట నూనె రాసి ఉడకపెట్టండి. ఇలా చేస్తే కోడి గుడ్డు పెంకులు ఈజీగా వచ్చేస్తాయి.
ఇక ఇప్పుడు ఎగ్స్ ను తీసి నాలుగు ముక్కలుగా కట్ చేసి గిన్నెలో పెట్టుకోవాలి. ఆ తర్వాత కరివేపాకును తీసుకుని నీటిలో శుభ్రం చేసి ప్లేట్ లో పెట్టుకోండి.
ఇప్పుడు పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి దానిలో ఆవాలు, జీలకర్ర కరివేపాకు, కట్ చేసిన ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి వేసి రంగు మారే వరకు బాగా వేయించాలి.
ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత దానిలో అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, మసాలా పొడి వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు ఉడికించిన ఎగ్స్ తీసుకుని వాటికి మసాలాలు పట్టించి 5 నిమిషాల మీడియం మంట మీద స్టవ్ మీదే ఉంచండి. దించే ముందు కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, వేడి వేడి కోడిగుడ్డు కరివేపాకు వేపుడు రెడీ.




