పంటలు పండే పొలంలో భారీ గొయ్యి పడటంతో అక్కడ ఉన్న గ్రామస్తులు, రైతులలో భయాందోళనలు మొదలయ్యాయి. సడన్‌గా అంత పెద్ద గొయ్యి ఎందుకు పడిందా అని గ్రామస్తులందరూ ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ శాఖకు సమాచారాన్ని అందించారు. వారు సంఘటనాస్థలానికి వచ్చి దానిని పరిశీలించి అక్కడ ఉన్న మట్టిని ల్యాబ్‌కు పంపించారట. అసలు ఇంతకు అక్కడ అంత పెద్ద గొయ్యి ఎందుకు పడింది.! వివరాల్లోకి వెళ్తే.. కడప నగరానికి కూతవేటు దూరంలో ఉన్న కాజీపేట మండలం చెముళ్లపల్లి గ్రామ పరిధిలోని సి.కొత్తపేట గ్రామ పొలాల్లో సడన్‌గా పెద్ద గొయ్యి దర్శనమిచ్చింది.
రైతులకు అక్కడ అంత పెద్ద గొయ్యి కనబడటంతో అందరూ షాక్ అయ్యారు. స్థానికులందరూ అక్కడకు చేరి ఆ గొయ్యిని చూసి మొదట భయాందోళనకు గురై స్థానిక రెవెన్యూ అధికారులకు సమాచారాన్ని అందించారు. వారు వచ్చి ఆ గొయ్యిని పరిశీలించారు. అది దాదాపు రెండున్నర అడుగుల వెడల్పు ఉండి.. 15 నుంచి 20 అడుగుల లోతు వరకు పడింది. అయితే ఆ గుంతలో అడుగుభాగాన నీళ్లు ఉండటంతో అది గతంలో బావి కోసం తవ్విన గొయ్యి లేదా భూమిలో సారం తగ్గి అంత పెద్ద గొయ్యి పడిందా అనే దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రెవెన్యూ అధికారులు. అంత పెద్ద గొయ్యి పడాలి అంటే గతంలో అక్కడ బావిని తవ్వి ఉండడమే ప్రధాన కారణంగా రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కానీ అసలు విషయం తెలుసుకోవడానికి ఆ భూమికి సంబంధించిన మట్టిని ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం. ఏది ఏమైనా ఉన్నట్టుండి పొలంలో అంత పెద్ద గొయ్యి పడటంతో స్థానిక రైతులు గ్రామస్తులలో ఆందోళన నెలకొంది.
ఇది చదవండి: హైదరాబాద్‌లో ‘ఖమేనీ’ పేరుతో రోడ్డు ఉందని మీకు తెలుసా.? ఆ పేరు ఎలా వచ్చిందంటే