మాస్ కా దాస్ విశ్వక్ సేన్, ‘జాతి రత్నాలు’ ఫేం అనుదీప్ కాంబినేషన్ లో వచ్చిన రీసెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఫంకీ’. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది. విశ్వక్ సేన్ మార్క్ కామెడీ యాక్షన్, కయాదు లోహర్ అంద చందాలు, అనుదీప్ మార్క్ డైలాగులు ఫంకీ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. ఇక సినిమా రిలీజ్ కు ముందు స్టోరీ, లాజిక్ వంటి విషయాలు పట్టించుకోవద్దని, కేవలం నవ్వుకోడానికి మాత్రమే ఫంకీ సినిమాకు రావాలని నిర్మాత నాగవంశీ ప్రమోషన్స్‌లో చెప్పారు. అందుకు తగ్గట్టుగానే సినిమాలో పెద్దగా స్టోరీ లేకున్నా మూవీ మొత్తం నవ్వుకునేలా ఉందని రివ్యూలు వచ్చాయి. మొత్తానికి థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఫంకీ సినిమాను ఓటీటీలోనూ చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. ఫంకీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మార్చి 12 లేదా 13 తేదీల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కు రావొచ్చని సమాచారం. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు టాక్.
ఇవి కూడా చదవండి
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఫంకీ సినిమాను నిర్మించారు. హీరో, హీరోయిన్లతో పాటు నరేష్, సంపత్ రాజ్, మురళీధర్ గౌడ్, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. .. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
#funky day 16 box office collection
Break even target 🎯 20 crs share needed 24 crs grossWorld wide day total gross 14.5 crs gross share 8 crs 🙃 loss around 12 crs loss
Movie finishes its run aiming for March 12 streaming from ott ✅ plat form Netflix
Consecutive 3 rd… pic.twitter.com/Q0e34Q3BX0— THE REVIEWS BLOGER 📝🏏⚡️ (@OG_RB5) March 2, 2026
కాగా ఫంకీ సినిమా తర్వాత కల్ట్ అనే సినిమాలో నటిస్తున్నాడు విశ్వక్ సేన్. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీని విశ్వక్ సేనే దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్ ఓ రేంజ్ లో ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.