OTT Movie: ఒక్క రోజే ముందే ఓటీటీలోకి వచ్చేసిన ఓం శాంతి శాంతి.. ఎక్కడ చూడొచ్చంటే..

OTT Movie: ఒక్క రోజే ముందే ఓటీటీలోకి వచ్చేసిన ఓం శాంతి శాంతి.. ఎక్కడ చూడొచ్చంటే..


డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇప్పుడు హీరోగానూ మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓం శాంతి శాంతి శాంతిః. ఇందులో ఈషా రెబ్బా కథానాయికగా నటించింది. 2022లో మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న జయ జయ జయహే సినిమాను తెలుగులో ఓం శాంతి శాంతి శాంతిః పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాకు డైరెక్టర్ ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించారు. జనవరి 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. కామెడీ పరంగా ఈ చిత్రం మెప్పించినప్పటికీ కమర్షియల్ హిట్ కాలేదు. ఇప్పుడు ఇదే సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఈమేరకు మెప్పిస్తుందో చూడాలి.

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..

ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. నిజానికి మార్చి 4 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు గోల్డ్ సబ్ స్క్రైబర్స్ కోసం ఒక రోజు ముందే అందుబాటులోకి వచ్చేసింది. పెళ్లి తర్వాత భర్త ప్రవర్తన కారణంగా సహనం కోల్పోయిన ఒక ఆడపిల్ల తిరగబడితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..

కథ విషయానికి వస్తే.. శాంతి (ఈషా రెబ్బా).. చిన్నప్పటి నుంచి తనకు నచ్చినట్లు ఉండాలనుకునే అమ్మాయి. ఇంటర్ తర్వాత ఉన్నత చదువులు చదవాలనుకున్నప్పటికీ కుటుంబ సభ్యులు వద్దనడంతో ఇంట్లోనే ఉండిపోతుంది. ఇంతలో ఆమెకు నాయుడు (తరుణ్ భాస్కర్) తో పెళ్లి చేస్తారు. వివాహం తర్వాత అత్తారింట్లో తనకు విచిత్ర పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా భర్తలో పుషాహంకారం బయటకు వస్తుంది. ప్రతి చిన్న విషయానికి శాంతిపై చేయి చేసుకుంటాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పగా.. సర్దుకుపోవాలని చెబుతారు. దీంతో యూట్యూబ్ చూసి కరాటే నేర్చుకుంటుంది. చివరకు తనను కొట్టడానికి వచ్చిన భర్తపై తిరగబడుతుంది. ఆ తర్వాత శాంతి జీవితంలో ఏం జరిగింది అనేది సినిమా.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‏తో చిరంజీవి లైఫ్ మారిపోయింది.. టాలీవుడ్ నటుడు..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *