
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కు ఉన్న రేంజ్, క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆర్ఆర్ఆర్, దేవర సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు ఎన్టీఆర్. ఇప్పుడీ నందమూరి హీరోకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే ఎన్టీఆర్ తన పర్సనల్ లైఫ్ ను మాత్రం చాలా గోప్యంగా ఉంచుతుంటారు. ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు అంతగా బయటకు రానివ్వరు. అయితే అప్పుడప్పుడు సినిమా ఈవెంట్స్, ఫ్యామిలీ ఫంక్షన్లు, టూర్లు, వెకేషన్స్ సందర్భాల్లో ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలు కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాల్లో హల్చల్ చేస్తుంటాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ తనయులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ఎన్టీఆర్ పెద్ద కుమారుడి పేరు అభయ్ రామ్ (11), చిన్న కుమారుడి పేరు భార్గవ్ రామ్. ఈ స్టార్ కిడ్స్ ప్రస్తుతం హైదరాబాద్ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ చిన్న తనయుడికి సంబంధించి ఒక విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ఇటీవల స్కూల్ లో నిర్వహించిన డ్రాయింగ్ పోటీల్లో భార్గవ్ రామ్ సత్తా చాటాడు. తన ట్యాలెంట్ తో ఓ ఏనుగు బొమ్మను అద్భుతంగా వేశాడు.
ఈ ఫొటో కాస్త బయటకు రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ ఫొటోలను తెగ వైరల్ చేస్తున్నారు. పెయింటింగ్ లో భార్గవ్ రామ్ ప్రతిభ అద్భుతమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Nandamuri #BhargavRam Latest Pic
#NTR pic.twitter.com/fg3GHUNMea
— News24/7 (@BreakingNews343) February 28, 2026
ఇక సినిమాల విషయానికి వస్తే.. వార్ 2 లో చివరిసారిగా కనిపించాడు యంగ్ టైగర్. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడీ గ్లోబల్ స్టార్. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. కేజీఎఫ్ సినిమాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హోంబలే నిర్మాణ సంస్థే ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగులో బిజీ బిజీగా ఉంటున్నాడు. దీంతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 సినిమా కూడా ఎన్టీఆర్ కంప్లీట చేయాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
